మాల్ లో కస్టమర్లు ఎక్కువ సేపు ఉండటానికి డిజైన్ ప్రధాన కారణం. దానికి ఎక్కడ కిటీకీలు లేకుండా చర్యలు తీసుకుంటారు. బయట వాతావరణం లోపల వారికి తెలియకుండా ఏర్పాట్లు చేస్తారు. మాల్ లోని లైటింగ్ కారణంగా మనకు సమయం తెలియదు. ఆధునిక కాలంలో దాదాపు ప్రతి చిన్న పట్టణంలోనూ షాపింగ్ మాల్స్ కనిపిస్తున్నాయి. గతంలో మెట్రో సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ మాల్స్ లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట దొరుకుతాయి. దుస్తులు, నిత్యావసరాలు, కూరగాయాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా.. ఏది కావాలన్నా చాాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అనేక వస్తువులను పరిశీలించి, నచ్చిన వాటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ షాపింగ్ మాల్స్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడా కిటీకీలు ఏర్పాటు చేయరు.
షాపింగ్ మాల్స్ ను ఈ తరహా డిజైన్ లో ఏర్పాటు చేసే విధానం అమెరికాలో ప్రారంభమైంది. అక్కడి మాల్ డెవలపర్లు వ్యూహాత్మకంగా ఈ పద్దతిని తీసుకువచ్చారు. కిటికీలు లేకపోవడం, లోపలి లైటింగ్ కారణంగా వాతావరణం కొత్తగా ఉంటుంది. సాయంత్రం అక్కడకు వెళ్లినా పగటి పూట ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో కస్టమర్లు తమకు తెలియకుండానే ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. షాపింగ్ మాల్స్ డిజైన్ గురించి స్ట్రాటజిక్ రిసోర్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బెర్ట్ ఫ్లికింగ్ కొన్ని విషయాలు వెల్లడించారు. ఉన్న స్థలాన్నంతా సద్వినియోగం చేసుకునేలా వీటి డిజైన్ ఉంటుందన్నారు. ఎక్కడా అనవసరంగా స్థలాన్ని వదిలి వేయకుండా వీటిని రూపొందిస్తారన్నారు. గోడలకు కిటీకీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో గోడలను వివిధ వస్తువుల డిస్ ప్లే కోసం వాడుకునే వీలుంటుంది..
మాల్స్ కు కిటికిలు లేకపోవడం వల్ల యజమానులకు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లోపలి వాతావరణాన్ని చాలా సులువుగా నియంత్రణ చేయవచ్చు. సాధారణంగా అన్ని మాల్స్ లో ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. కిటీకీలు లేనప్పుడు ఏసీ నుంచి వచ్చే శీతల పవనాలను బయటకు వెళ్లవు. దీంతో తక్కువ ఖర్చుతో మాల్ అంతా చల్లబడుతుంది. అలాగే ఉష్థోగ్రత నియంత్రణలో ఉంటేనే లోపలకు వస్తువులు పాడైపోకుండా ఉంటాయి. షాపింగ్ మాల్స్ లోని వాతావరణం కస్టమర్లకు ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి సంగీతం, ఆహ్లాదకరమైన సువాసనలు, ఇండోర్ మొక్కలు, మెరిసే ఫ్లోర్ లతో ముచ్చటగొలుపుతుంది. ఫలితంగా కొనుగోలుదారులు ఎక్కువ సమయంలో లోపల ఉంటారు. తద్వారా ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి