దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చేది ఏదంటే టక్కున చెప్పే సమాధానం రైళ్లు. దేశవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల వేర విస్తరించిన రైల్వేలు ఎంతో మందిని గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ఇక రైలు ప్రయాణం ఎంత సంతోషంగా ఉంటుందో రైల్వేలో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా అన్నే ఉంటాయి. రైలు లోపల ఉండే చైన్ నుంచి రైలు బోగీలపై రాసి ఉన్న అక్షరాల వరకు వాటిలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి చివరి బోగి వెనకాల రాసి ఉండే ‘X’ సింబల్. మీలో చాలా మంది దీనిని కచ్చితంగా గమనించే ఉంటారు. అయితే ఎలా ఎందుకు రాసి ఉంటుందన్న దానిపై ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రైలు చివరి బోగిపై తెలుపు లేదా పసుపు రంగుతో ‘X’ గుర్తును రాస్తారు. రైలుకు అదే చివరి కోచ్ అని తెలిపేందుకు ఈ గుర్తును వేస్తారు. ప్రయణించే రైలు కోచ్‌లను మధ్యలో వదలకుండా ముందుకు వెళుతుందని దీని ద్వారా తెలుసుకుంటారు. ఒకవేళ చివరి బోగీపై ఈ గుర్తు లేకపోతే ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగినట్లు భావిస్తారు. అందుకే స్టేషన్ నుంచి రైలు క్రాసింగ్ అయ్యే సమయంలో గార్డు.. ‘X’ మార్కును గుర్తించిన తరువాతనే రైలు బోగీలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్థారిస్తూ ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.
Did you Know?
The letter ‘X’ on the last coach of the train denotes that the train has passed without any coaches being left behind. pic.twitter.com/oVwUqrVfhE
— Ministry of Railways (@RailMinIndia) March 5, 2023
ఒకవేళ ‘X’ గుర్తు లేకపోతే వెంటనే అలర్ట్ అయ్యే స్టేషన్ మాస్టర్ హెచ్చరికను జారీ చేస్తారు. దీంతో అధికారులు అలర్ట్ అవుతారు. ఇక X సింబల్‌తో పాటు LV అని కూడా రాసి ఉంటుంది. దీని అర్థం.. “లాస్ట్ వెహికల్”. వీటితో పాటు చివరి బోగీపై రెడ్ కలర్ లైట్ కూడా ఉంటుంది. రాత్రి సమయాల్లో చివరి బోగీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రైలు మధ్యలో ఉండే ఏ కోచ్‌పై వెనకాల కూడా ఇలాంటి సింబల్స్ ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..