PAN Card: పాన్‌ కార్డ్‌ నెంబర్‌ దేనిని సూచిస్తుందో తెలుసా.? అసలు విషయం ఇదే..

|

Aug 11, 2024 | 6:59 PM

ఆధార్‌ కార్డ్ ఎంత ముఖ్యంగా మారిందో పాన్‌ కార్డ్‌ కూడా అంతే అవసరపడుతోంది. ఒకప్పుడు కేవలం కొంతమంది వద్దే పాన్‌ కార్డ్‌లు ఉండేవి. కానీ ప్రస్తుతం బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా తప్పనిసరిగా ఉండడంతో అందరూ పాన్ కార్డ్‌లను తీసుకుంటున్నారు. రుణాలు పొందడం మొదలు ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే....

PAN Card: పాన్‌ కార్డ్‌ నెంబర్‌ దేనిని సూచిస్తుందో తెలుసా.? అసలు విషయం ఇదే..
Pan Card
Follow us on

ఆధార్‌ కార్డ్ ఎంత ముఖ్యంగా మారిందో పాన్‌ కార్డ్‌ కూడా అంతే అవసరపడుతోంది. ఒకప్పుడు కేవలం కొంతమంది వద్దే పాన్‌ కార్డ్‌లు ఉండేవి. కానీ ప్రస్తుతం బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా తప్పనిసరిగా ఉండడంతో అందరూ పాన్ కార్డ్‌లను తీసుకుంటున్నారు. రుణాలు పొందడం మొదలు ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. పన్ను చెల్లింపుదారులను గుర్తించే కంప్యూటర్ ఆధారిత వ్యవస్థనే పాన్ కార్డు అంటారని మనందరికీ తెలిసిందే.

పన్ను చెల్లింపుదారులకు గుర్తించడానికి పాన్‌ కార్డ్ తీసుకున్న వారికి శాశ్వత ఖాతా నెంబర్ లేదా ప్యాన్‌ నెంబర్‌ను జారీ చేస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన నెంబర్‌. పది అంకెలు ఉండే పాన్ నెంబర్‌ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. నెంబర్స్‌తో పాటు లెటర్స్‌ ఉండే ఈ నెంబర్‌ దేనిని సూచిస్తుంది.? అసలు ఈ నెంబర్‌ వెనకాల ఉన్న అర్థం ఏంటో అని ఎప్పుడైనా సందేహం వచ్చిందా.? ఏటీఎమ్‌పై ఉన్నట్లుగానే పాన్‌ కార్డ్‌పై కూడా ఈ ప్రత్యేక నెంబర్‌ను కేటాయిస్తారు.

పాన్‌ కార్డ్‌పై 10 అంకెల యూనిక్‌ నెంబర్ ఉంటుంది. ఇందులో నెంబర్స్‌తో పాటు, కొన్ని లెటర్స్‌ ఉంటాయి. ఇందులో పాన్‌ నెంబర్‌తో పాటు ఒక అక్షరం పాన్‌ కార్డ్‌ హోల్డర్‌ స్థిని చూపిస్తుంది. నాల్గవ ఆక్షరం ఏంటన్న దానిబట్టి మీ కార్డు ఏంటో చెప్పొచ్చు. ఉదాహరణకు C అంటే కంపెనీ, P అంటే ఇండివిజువల్, H అంటే హిందూ అవిభక్త కుటుంబం, F అంటే సంస్థ, A అంటే అసోసియేషన్ ఆఫ్ పీపుల్ T అంటే ట్రస్ట్ అని అర్థం. పాన్ కార్డు కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా సంస్థలకు కూడా అందిస్తారు. అందుకే ఇలా విభిన్న లెటర్స్‌ ద్వారా వీటిని వర్గీకరించారు.

మరి పాన్‌ కార్డ్‌ నెంబర్‌ మార్చుకునే వెసులుబాటు ఏమైనా ఉంటుందా.? అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పాన్‌ కార్డ్ నెంబర్‌ను మార్చుకోవడం కుదరదు. ఒక్కసారి వచ్చిన నెంబర్‌ పర్మినెంట్‌గా ఉండాల్సిందే. అయితే పాన్‌కార్డ్‌లో ఉన్న పేరు, పుట్టినతేదీని మాత్రం మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం వెబ్‌సైట్ నుంచి పాన్‌ కార్డ్ కరెక్షన్‌ ఫామను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..