భారతదేశంలో ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరిగా మారుతుంది. వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హత నిర్ణయించడానికి ఆధార్ కీలకంగా మారుతుంది. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఆధార్ ఆధారిత మోసాల కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ మోసపూరిత కార్యకలాపాలతో బ్యాంకుల్లోని సొమ్మను తస్కరించేందుకు ముష్కరులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఏమరపాటు ఎక్కడైన ప్రూఫ్ కింద ఇచ్చే ఆధార్ కార్డుల ద్వారా ఓటీపీ, సీవీవీ లేకుండా మన ఖాతాల్లోని సొమ్మును మాయం చేస్తుంది. ముఖ్యంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని అనేక నివేదికలు వెలువడ్డాయి. ఈ మోసాల నుంచి రక్షణగా ఆధార్‌లో కొత్త సదుపాయం ఉందని చాలా మందికి తెలియదు. అదే మాస్క్‌డ్ ఆధార్. మన పూర్తి ఆధార్ నెంబర్ కనిపించకుండా వచ్చే ఈ మాస్క్‌డ్ ఆధార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేసే ఈ స్కామ్‌లలో సిలికాన్ ఫింగర్‌ప్రింట్‌లు, అనధికారిక బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించి వ్యక్తుల ఆధార్-లింక్డ్ వేలిముద్రలను డూప్లికెట్ చేసి బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులు కొట్టేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలను అరికట్టేందుక బయోమెట్రిక్‌లను లాక్ చేయడం మెరుగైన మార్గంగా ఉన్నప్పటికీ అసలు మన ఆధార్ డేటా ముష్కరుల చేతికి వెళ్లకుండా మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. మాస్క్‌డ్ ఆధార్ అనేది గోప్యతను మెరుగుపరచడానికి, ఆధార్ వివరాలను బహిర్గతం చేయడాన్ని పరిమితం చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పరిచయం చేసిన ఓ మేలైన ఫీచర్. మాస్క్‌డ్ ఆధార్‌లో ఆధార్ నంబర్‌లోని కొన్ని అంకెలు అస్పష్టంగా ఉంటాయి, అయితే పేరు, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటి కీలకమైన జనాభా సమాచారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డ్, ఈ ఆధార్ వంటి వాటిల్లో కూడా మాస్క్‌డ్ ఆధార్ అందుబాటులో ఉంది. మీ మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేఅవుతుంది. మీరు మీ ఆధార్ నంబర్‌ను అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఈ కార్డును ప్రింట్ చేసి ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..