Post Office Saving Scheme: సీనియర్‌ సిటిజన్ల కోసం తపాలా శాఖ ప్రత్యేక పథకం.. అధిక వడ్డీతో పాటు.. నగదు భద్రం..

Senior Citizen Savings Scheme: వయసు పెరిగేకొద్ది.. జీవితంపై ఆందోళన మొదలువుతుంది. సాధారణంగా పెద్ద వయసు వారికి అనేక రోగాలు రావడానికి కారణం కూడా.. వారిలో టెన్షన్ పెరగడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు వయసు పెరిగితే ఓపిక..

Post Office Saving Scheme: సీనియర్‌ సిటిజన్ల కోసం తపాలా శాఖ ప్రత్యేక పథకం.. అధిక వడ్డీతో పాటు.. నగదు భద్రం..
Post Office Scheme
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 29, 2022 | 8:57 AM

Senior Citizen Savings Scheme: వయసు పెరిగేకొద్ది.. జీవితంపై ఆందోళన మొదలువుతుంది. సాధారణంగా పెద్ద వయసు వారికి అనేక రోగాలు రావడానికి కారణం కూడా.. వారిలో టెన్షన్ పెరగడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు వయసు పెరిగితే ఓపిక తగ్గుతుంది. కష్టపడే సామర్థ్యం తగ్గుతుంది. భవిష్యత్తు జీవితం బాగుండాలంటే పొదుపు తప్పనిసరి. అందుకే చాలా మంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటారు. ఈ పొదుపుపై వచ్చే వడ్డీతో కాలం గడపాలనుకుంటారు చాలా మంది. దీనికోసం మంచి వడ్డీ రేటుతో పాటు.. మన డబ్బు సేఫ్ గా ఉండే చోట పొదుపు చేయాలనుకుంటారు. బ్యాంకుల్లో అయితే డబ్బు సేఫ్ కాని.. వడ్డీ తక్కువ. మరి బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ప్రయివేటు సంస్థలు కొంత ఎక్కువ ఆఫర్ చేసినా.. డబ్బు సురక్షితమో కాదో అనే అనుమానం వెంటాడుతూ ఉంటుంది. అటువంటి వారి కోసం కేంద్రప్రభుత్వానికి చెందిన భారత తపలా శాఖ సీనియర్ సిటిజన్ల కోసం ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్స్ కోసం తపలా శాఖ అందిస్తున్న పొదుపు పథకంలో 7.6% వార్షిక వడ్డీ రేటును ఇస్తుంది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ SBI సహా అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా ఇది ఎక్కువ. వృద్ధులు రిస్క్ లేని పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తారు. జీవిత కాలం కష్టపడి సంపాదించిన డబ్బును వృద్ధాప్యంలో రిస్క్ ఉన్న పెట్టుబడులపై పెట్టడం సరికాదనే ఆలోచనతో ఉంటారు. సాధారణంగా సమ్మకమైన పెట్టుబడి సాధనంగా వారు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లను భావిస్తారు. ఇలాంటి వారి కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఒకటి.

సీనియర్ సిటిజన్లు కోరుకునే గవర్న్మెంట్ బ్యాక్డ్, రిస్క్ ఫ్రీ, పోస్ట్ ఆఫీస్ స్కీం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈపథకంలో సీనియర్ సిటిజన్లు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. 60 ఏళ్లు పైబడిన ఎవరైనా రూ.1000 నుంచి రూ.15,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి అకౌంట్ ను ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర సాధారణ ఫిక్సడ్ డిపాజిట్ల మాదిరి గానే ఈ పథకానికి కూడా లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. అలాగే, ఈ పథకం ద్వారా వచ్చే ఆదాయం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద, పన్ను పరిధిలోకి రాదు.

ఈపథకం ద్వారా ఆదాయం ఎలా వస్తుందో పరిశీలిస్తే ప్రస్తుత వడ్డీ రేటునే ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తే.. ఒక సీనియర్ సిటిజన్ రూ.15 లక్షలను ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, ఆ సీనియర్ సిటిజన్ ప్రతీ మూడు నెలలకు రూ. 27వేల750 రూపాయల వడ్డీ ఆదాయం పొందుతారు. అంటే, సంవత్సరానికి రూ. 1,11,000 వడ్డీ పొందుతారు. అంటే, ఐదేళ్ల మెచ్యురిటీ పీరియడ్ ముగిసిన తరువాత, ఆ వ్యక్తి రూ. 5,55,000ల మెచ్యూరిటీ అమౌంట్ ను పొందుతారు. అలాగే, డిపాజిట్ చేసిన రోజు ఏ వడ్డీ రేటు ఉందో, మెచ్యూరిటీ పీరియడ్ ముగిసే ఐదేళ్ల వరకు అదే వడ్డీ రేటు లాక్ అయి ఉంటుంది. అ పథకంలో జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అంటే, భార్యభర్తలిద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే, గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా చేస్తే వారికి, వార్షికంగా రూ. 2,22,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..