EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి..

|

Jul 19, 2024 | 4:25 PM

అయితే ఇంతకీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉంది.? ప్రతీ నెల అసలు ఎంత అమౌంట్ యాడ్‌ అవుతుంది.? లాంటి వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. పీఎఫ్‌ బ్యాలన్స్‌తోపాటు ఎంత అమౌంట్‌ యాడ్‌ అవుతుంది లాంటి వివరాలు తెలుసుకునేందుకు 4 మార్గాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రతీ ఉద్యోగికి పీఎఫ్‌ అకౌంట్‌...

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి..
Epfo
Follow us on

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్‌ ఖాతాపై అవగాహన ఉండే ఉంటుంది. ఉద్యోగికి వచ్చే జీతంలో కొత్త మొత్తాన్ని ప్రతీ నెల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అకౌంట్‌కు జమ చేస్తుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మధ్యలో ఏవైనా అత్యవసర ఆర్థిక పరిస్థితులు వచ్చినా పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఇంతకీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉంది.? ప్రతీ నెల అసలు ఎంత అమౌంట్ యాడ్‌ అవుతుంది.? లాంటి వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. పీఎఫ్‌ బ్యాలన్స్‌తోపాటు ఎంత అమౌంట్‌ యాడ్‌ అవుతుంది లాంటి వివరాలు తెలుసుకునేందుకు 4 మార్గాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రతీ ఉద్యోగికి పీఎఫ్‌ అకౌంట్‌ కచ్చితంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా పీఎఫ్ అకౌంట్‌కి మీ మొబైల్ నంబర్‌ను లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.

* ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇందుకు ముందు మీ ఫోన్‌ నెంబర్‌ UANతో రిజిస్టర్ అయి ఉండాలి. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 7738299899కి EPFOHO<space>UAN<space>ENG అని ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. దీంతో వెంటనే మీ ఈపీఎఫ్ అకౌంట్ సహా అందులోని బ్యాలెన్స్ వివరాలు మీకు మెసేజ్‌ రూపంలో వస్తాయి.

* ఇక మిస్డ్‌ కాల్‌ ద్వారా కూడా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 9966044425కు మిస్డ్ ఇస్తే చాలు. వెంటనే మీకు పీఎఫ్‌ బ్యాలన్స్‌ వివరాలతో కూడిన మెసేజ్‌ వస్తుంది.

* వెబ్‌సైట్‌ ద్వారా కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.inలోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌ పేజీలో సర్వీసెస్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని For Employessపై క్లిక్‌ చేయాలి. తర్వాత పాస్‌బుక్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మీ UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. దీంతో మీ పీఎఫ్‌ అమౌంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు సవివరంగా కనిపిస్తాయి. మీరు గతంలో పనిచేసిన సంస్థలకు సంబంధించిన పీఎఫ్‌ అమౌంట్‌ కూడా కనిపిస్తుంది.

* ఉమంగ్ మొబైల్ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ అకౌంట్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌ లేదా యాపిల్ స్టోర్‌ నుంచి UMANG యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేసి EPFOపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత View Passbook ఆప్షన్ ఎంచుకొని.. మీ UAN నంబర్, పాస్‌వర్ ఎంటర్‌ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..