Aadhaar: మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ అయిందా, ఇలా చెక్‌ చేసుకోండి..

|

Mar 10, 2024 | 7:21 PM

ఆధార్‌ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు గడువు ఇప్పటికే ముగియగా మరోసారి మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. మరి ఈ నేపథ్యంలో ఇంతకీ మీ ఆధార్‌ కార్డు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ అయ్యిందో లేదో అన్నమానం ఉందా.? కొన్ని రకాల సింపుల్ స్టెప్స్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు....

Aadhaar: మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ అయిందా, ఇలా చెక్‌ చేసుకోండి..
Aadhaar Card
Follow us on

ప్రస్తుతం ఆధార్‌ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. సిమ్‌ కార్డు మొదలు ఫ్లైట్ టికెట్ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఇక ఆధార్‌ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు మార్పుల తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదేళ్లుగా తమ ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది. దీంతో ఆధార్‌ కార్డుదారులు అప్‌డేట్ చేసుకున్నారు.

ఆధార్‌ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు గడువు ఇప్పటికే ముగియగా మరోసారి మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. మరి ఈ నేపథ్యంలో ఇంతకీ మీ ఆధార్‌ కార్డు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ అయ్యిందో లేదో అన్నమానం ఉందా.? కొన్ని రకాల సింపుల్ స్టెప్స్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం పాటించిన ఆ టిప్స్‌పై ఓ లుక్కేయండి..

ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు, ఫోన్ నెంబర్, చిరునామా ఇలా ఏదో ఒకటి అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయాలంటే తగిన సాక్ష్యాలు కావాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ మార్చేందుకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. ఈ వివరాలను ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో పూర్తి చేయవచ్చు.

ఇక ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాల అప్‌డేట్‌ స్టేటష్‌ను చెక్‌ చేసేందుకు యూఐడీఏఐ టోల్ ఫ్రీ నెంబర్ 1947కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే మీకు సమీపంలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంట్లోనే ఉండి మీ మొబైల్‌లోనే ఈ వివరాలను తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో ఆధార్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, ఓటీటీ ఎంటర్ చేయాలి. ఆ తరువాత అప్‌డేట్ రిక్వస్ట్ స్టేటస్ క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై అందుకు సంబంధించిన వివరాలు కన్పిస్తాయి. ఆన్‌లైన్‌ విషయానికొస్తే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లిట్రాక్ ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓటీపీతో వెరిఫై చేశాక సబ్మిట్ క్లిక్ చేస్తే మీ వివరాల స్టేటస్ కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..