
మనం సంపాదించిన సొత్తు, ఇతర ఆభరణాలు, ముఖ్యమైన పేపర్లు అన్నింటినీ చాలా మంది బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తూ ఉంటారు. అయితే బ్యాంకు లాకర్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్‌బీఐ బ్యాంకులకు కొన్ని సూచనలు ఇచ్చింది. వివిధ బ్యాంకుల్లో లాకర్లను కలిగి ఉన్న కస్టమర్‌లు జూన్ 30లోపు సవరించిన లాకర్ ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2023 నాటికి బ్యాంకులు దశలవారీగా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆర్‌బీఐ గడువును పొడిగించింది. జూన్ 30, 2023న 50 శాతం ఒప్పందాల పునరుద్ధరణకు సంబంధించి మొదటి విడత గడువుగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్‌లను అప్‌డేట్ చేస్తూ, “మా గౌరవనీయమైన కస్టమర్‌లు తమ లాకర్ హోల్డింగ్ బ్రాంచ్‌ని సంప్రదించి, సవరించిన/సప్లిమెంటరీ లాకర్ ఒప్పందాన్ని వర్తించే విధంగా అమలు చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము” అని ఎస్‌బిఐ ఇటీవల ఒక ట్వీట్‌లో తెలిపింది. కాబట్టి మీరు ఎస్‌బీఐలో లాకర్ ఉంటే తప్పనిసరిగా జూన్ 30లోపు హోం బ్రాంచ్‌ను సంప్రదించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
పెద్ద సంఖ్యలో ఖాతాదారులు ఇంకా సేఫ్ డిపాజిట్ లాకర్ హోల్డర్లతో సవరించిన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి బ్యాంకులు డిసెంబర్ చివరి వరకు గడువును జనవరిలో ఆర్భీఐ పొడిగించింది. ఆగస్టు 2021లో బ్యాంకింగ్ మరియు టెక్నాలజీ రంగంలో వివిధ పరిణామాలు, వినియోగదారుల ఫిర్యాదుల స్వభావం మరియు స్వీకరించిన ఫీడ్‌బ్యాక్‌ల దృష్ట్యా, జనవరి 1, 2023 నాటికి ప్రస్తుత లాకర్ హోల్డర్లతో సవరించిన ఒప్పందాలను కుదుర్చుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది. అయితే దఫదఫాలుగా గడవును పెంచుతూ వస్తున్న ఆర్‌బీఐ ఈ నెలాఖరు నాటికి కచ్చితంగా 50 శాతం మేర లాకర్ల ఖాతాదారులు ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిందేనని పేర్కొంది.
సవరించిన అవసరాల గురించి బ్యాంకులు తమ కస్టమర్లందరికీ తెలియజేయాలి.
బ్యాంకులు తమ కస్టమర్లలో కనీసం 50 శాతం మంది తమ ఒప్పందాలను పునరుద్ధరించుకున్నారని నిర్ధారించుకోవాలి.
బ్యాంకులు తమ ఖాతాదారులలో కనీసం 75% మంది తమ ఒప్పందాలను పునరుద్ధరించుకున్నారని నిర్ధారించుకోవాలి.
లాకర్ ఖాతాదారులు మొత్తం ఒప్పందాలను పూర్తి చేసుకోవాల్సిందే. అలా చేయని ఖాతాదారుల లాకర్లు రద్దు అవుతాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం