
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాలకు 19 విడతల డబ్బు జమ కాగా, 20వ విడత ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ 20వ విడత జూలై 18, 2025 నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,000 జమ అవుతుందని ముందుగా భావించినప్పటికీ అధికారికంగా ఎలాంటి నిధులు విడుదల చేయలేదు కేంద్రం.
ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలో రూ. 6,000 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బు ప్రతి 4 నెలలకు రూ. 2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19 విడతలుగా రూ. 2,000 రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఇప్పుడు 20వ విడత రూ. 2,000 ఎప్పుడు జమ అవుతుందో అని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
20వ విడతకు సంబంధించి సమాచారం
రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపు పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి సమాచారం అందినట్లు తెలుస్తోంది. జూలై 25, 2025న విడుదల కావచ్చని సమాచారం. అయితే దీనిపై కేంద్రం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సంవత్సరం దాదాపు 2.5 లక్షల కొత్త కిసాన్ కార్డులు రైతులకు జారీ చేయనున్నట్లు సమాచారం. అయితే జూలై 25వ తేదీన ఈ విడత డబ్బులు మోడీ విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇది కూడా చదవండి: Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్.. వీరికి టోల్ ట్యాక్స్ ఉండదు!
మీకు ఇంకా ప్రధానమంత్రి కిసాన్ డబ్బు అందలేదా?
మీరు ఇంకా మీ 20వ విడత PM కిసాన్‌ను అందుకోకపోతే, మీరు e KYC చేసి ఉండకపోవచ్చు. మీ 20వ విడత పీఎం కిసాన్‌ను పొందడానికి E KYC తప్పనిసరి. అందుకే మీ KYCని ఆన్‌లైన్‌లో చాలా త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పీఎం కిసాన్ 20వ విడత పొందుతారని గమనించాలి.
ఇది కూడా చదవండి: Dog Walker: ఇతను కుక్కలకు వాకింగ్ చేయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి