Personal Loan: ఆ రుణాలతో దీపావళి సెలబ్రేషన్స్ మరింత ఈజీ.. ఆ లోన్ వల్ల ప్రయోజనాలివే..!

|

Oct 27, 2024 | 6:25 PM

భారతదేశంలో ప్రస్తుతం దీపావళి సందడి నెలకొంది. ముఖ్యంగా మరో రెండు రోజుల్లో రానున్న ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేసిన మనకు బాగా కావాల్సిన వారికి ఇస్తూ ఉంటారు. అలాగే పండుగ అంటే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో భారీగా ఖర్చు ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగ ఇంటెళ్లిపాది హ్యాపీగా చేసుకోవాలంటే కచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పర్సనల్ లోన్స్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

Personal Loan: ఆ రుణాలతో దీపావళి సెలబ్రేషన్స్ మరింత ఈజీ.. ఆ లోన్ వల్ల ప్రయోజనాలివే..!
Money Astrology
Follow us on

దీపావళి సమీపిస్తున్న కొద్దీ యువత ఉత్సాహంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. చాలామంది తమ ఇళ్లను డెకరేట్ చేసుకోవడంతో పాటు నచ్చిన వారికి  బహుమతులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే ఈ పండుగను నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్న చాలా మంది వినియోగదారులకు వ్యక్తిగత రుణాలు ఆచరణీయమైన ఎంపికగా ఉన్నాయి. నెలవారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా కాలానుగుణ ఖర్చులను నావిగేట్ చేయడంలో పర్సనల్ లోన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పండుగ సమయంలో పర్సనల్ లోన్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు చెప్పే విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఖర్చు చేయడం

వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు ఖర్చు విషయంలో మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తాయి. మీరు మీ ఇంటిని బాగు చేయించుకోవాలనుకున్నా, కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, అయిన వారికి బహుమతులు ఇవ్వాలనుకున్నా వ్యక్తిగత రుణాలు తీసుకుంటే ఆ ఖర్చులను సింపుల్‌గా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తలతో పాటు రీపేమెంట్ చేసేటప్పుడు మన ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసుకుని ఈ రుణాలను తీసుకోవాలి.

డాక్యుమెంటేషన్

పర్సనల్ లోన్స్ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. అలాగే లోన్ అప్రూవ్ అయిన నిమిషాల్లోనే సొమ్ము మన ఖాతాకు జమ అవుతుంది. ఈ సదుపాయం పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు పరిమిత-సమయ ఆఫర్‌లు లేదా అత్యవసర కొనుగోళ్ల కోసం సొమ్ము అవసరమైనప్పుడు పర్సనల్ లోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

రీపేమెంట్ ఎంపికలు

అయితే నెలవారీ చెల్లింపులను నిర్వహించడం అనేది రుణగ్రహీతలకు తరచుగా ఆందోళన కలిగిస్తుంది అయితే వ్యక్తిగత రుణాలు ఈ విషయంలో కూడా ఈ ఇబ్బంది ఉండదు. చాలా వ్యక్తిగత రుణాలు అనువైన రీపేమెంట్ కాలపరిమితితో వస్తాయి. రుణగ్రహీతలు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ఈఎంఐ ఎంపికలను ఎంచుకునే సదుపాయం ఉంటుంది. 

ష్యూరిటీ

వ్యక్తిగత రుణాలు పొందడానికి ఎలాంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అత్యవసరంగా నిధులు అవసరమైనప్పుడు తాకట్టు పెట్టడానికి ఆస్తులు లేని వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  ఇతర స్వల్పకాలిక రుణ ఎంపికలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు సాధారణంగా పెద్ద మొత్తాలను అందజేస్తాయి. వాహనానికి ఫైనాన్సింగ్ చేసినా ఖరీదైన గాడ్జెట్‌లను కొనుగోలు చేసినా లేదా మీ ఇంటిని పునర్నిర్మించినా, వ్యక్తిగత రుణాలు పెద్ద మొత్తాలకు యాక్సెస్‌ను అందిస్తాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి