Direct sales: ఆమ్‎వే, టప్పర్‎వేర్‎కు కేంద్రం షాక్.. డైరెక్ట్ సేల్స్‎పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం..

|

Dec 29, 2021 | 2:27 PM

ఆమ్ వే, టప్పర్ వేర్, ఒలిఫ్లేమ్ వంటి డైరెక్ట్ సేల్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝూళిపించింది.

Direct sales: ఆమ్‎వే, టప్పర్‎వేర్‎కు కేంద్రం షాక్.. డైరెక్ట్ సేల్స్‎పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం..
Direct Sales Company
Follow us on

ఆమ్ వే, టప్పర్ వేర్, ఒలిఫ్లేమ్ వంటి డైరెక్ట్ సేల్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను చైన్ వ్యవస్థ లేదా పిరమిడ్ వ్యవస్థ ద్వారా అమ్ముతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నిబంధనల అమలుకు ఆయా కంపెనీలకు 90 రోజుల గడువును విధించింది.

నిబంధనలు

కంపెనీల కార్యకలాపాల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలి. డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీలు పిరమిడ్‌ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు. ఆమ్వే కంపెనీలు ఈ కామర్స్‌ సైట్ల ద్వారా సాగించే అమ్మాకాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి. తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను కంపెనీలే పరిష్కరించాలి. ఇందుకు సంబంధించి కంపెనీలు తమ వెబ్ సైట్లలో ప్రస్తుత, అప్ డేటెడ్ అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ పొందు పరచాలి. ఫిర్యాదు అందిన 48 గంటల్లో రిసీప్ట్‎ను వినియోగదారుడికి అందేలా ఆ అధికారి చర్యలు తీసుకోవాలి.

వినియోగదారుల ఫిర్యాదులను ఈ రిసీప్ట్ ఇచ్చిన తేదీ నుంచి మొదలు నెలరోజుల్లో పరిష్కరించాలి. నెలరోజుల సమయం దాటితే తగిన వివరాలతో ఫిర్యాదుదారుడికి తెలపాల్సిన బాధ్యత ఆ కంపెనీ అధికారిపై ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల అమలుకు బాధ్యతవహించేందుకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలి. డైరెక్ట్ సెల్లర్స్ పూర్తి కాంటాక్ట్ వివరాలకు సంబంధించి రికార్డులను ఆయా కంపెనీలు నిర్వహించాల్సి ఉంటుంది. డైరెక్ట్‌ అమ్మకాల వ్యాపారంలో ఉన్న విదేశీ కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్‌ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలి.

ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలను డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీలు స్వాగతించాయి. నూతన నిబంధనలు స్వాగతిస్తున్నామని డైరెక్ట్‌ సెల్లింగ్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌, ఆమ్వే ఇండియా, కార్పొరేట్‌ అఫైర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజత్‌ బెనర్జీ చెప్పారు. డైరెక్ట్‌ సెల్లింగ్‌ మార్కెట్‌పై ఆధారపడి దేశంలో 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఇందులో సగం మంది మహిళలే ఉన్నారని రజత్ బెనర్జీ పేర్కొన్నారు.

Read Also.. ITR Filing FY 2020-21: ఐటీఆర్ పత్రాల వెరిఫికేషన్ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..