Digital Rupee: రేపటి నుంచే అందుబాటులోకి ‘డిజిటల్ కరెన్సీ’.. ఆర్‌బీఐ కీలక ప్రకటన..

|

Oct 31, 2022 | 7:45 PM

డిజిటల్​ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్​ కరెన్సీని రేపటి నుంచి (నవంబర్​1) ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్ల సోమవారం ఆర్బీఐ ప్రకటించింది.

Digital Rupee: రేపటి నుంచే అందుబాటులోకి ‘డిజిటల్ కరెన్సీ’.. ఆర్‌బీఐ కీలక ప్రకటన..
Rbi Digital Currency
Follow us on

డిజిటల్​ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్​ కరెన్సీని రేపటి నుంచి (నవంబర్​1) ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్ల సోమవారం ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇస్తూ, ఇప్పుడున్న కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ అందుబాటులోకి తెస్తోంది. డిజిటల్‌ రూపాయి ప్రయోగాత్మకంగా రేపటి నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. టోకు అవసరాలకు వినియోగించే డిజిటల్‌ రూపాయిని తొలుత ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలకు డిజిటల్‌ రూపీని వినియోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల ద్వారా డిజిటల్‌ రూపీని ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇక రిటైల్‌ అవసరాలకు సంబంధించిన డిజిటల్‌ రూపాయిని సైతం ఓ నెల రోజుల్లో ప్రారంభమవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో వ్యాపారులు, వినియోగదారుల మధ్య ఈ లావాదేవీలు నిర్వహిస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది.

అయితే.. ఆర్‌బీఐ త్వరలోనే డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) గా వ్యవహరించే ఇ-రూపీపై కాన్సెప్ట్‌ నోట్‌ ను విడుదల చేసింది. అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు ‘డిజిటల్‌ రూపాయి’ ని తీసుకుస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..