ఎలక్ట్రిక్ టూ వీలర్ అగ్నిప్రమాదాల నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను విడుదల చెయ్యొద్దని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులను ప్రభుత్వం కోరినట్లు మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తోసిపుచ్చింది. ఉత్పత్తిని నిలిపివేయమని ఏ EV తయారీదారుడిని ఆదేశించలేదని మంత్రిత్వ శాఖ ఒక వివరణ ఇచ్చింది. “అగ్నిప్రమాద సంఘటనలపై దర్యాప్తు జరిగే వరకు కొత్త వాహనాలను ప్రారంభించవద్దని MoRTH ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులను కోరినట్లు మీడియా వార్తలు వచ్చాయి. అయితే అలాంటి సూచనలేవీ చేయలేదని, అలాంటి నివేదికలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఈ వారం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ EV తయారీదారులకు పలు సూచనలు చేశారు. ఫాల్ట్ ఉన్న ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని హెచ్చరించారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని EV బ్యాటరీలు సమస్యలను ఎదుర్కొంటాయని చెప్పారు. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించేందుకుప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. EV పరిశ్రమ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. “మేము అడ్డంకిని పెట్టకూడదనుకుంటున్నాము, అయితే భద్రతకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని” అని చెప్పారు. ఏదైనా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే “భారీ జరిమానా విధిస్తామని, అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశిస్తామని” అని గడ్కరీ EV తయారీదారులను హెచ్చరించారు. డిఫాల్ట్ చేసిన కంపెనీలపై మేము అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలను జారీ చేస్తుందని వివరించారు. దేశంలో మూడు ప్యూర్ EV, ఒక Ola, రెండు ఒకినావా, 20 జితేంద్ర EV స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
.@ETAuto has reported that the Ministry of Road, Transport and Highways has told electric vehicle manufacturers to halt new two-wheeler launches.@PIBFactCheck
➡️This Report is #Fake
➡️No such directive has been given by @MORTHIndia. pic.twitter.com/Sd0sxwYhmP
— PIB Fact Check (@PIBFactCheck) April 28, 2022
Read Also.. Coal Shortage: దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత..