Bank Fraud: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణం.. రూ.34000 కోట్ల మోసం.. మాజీ డైరెక్టర్‌ అరెస్ట్‌

దేశంలో బ్యాంకింగ్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు పెద్ద ఎత్తున బ్యాంకు మోసాలకు పాల్పడగా, వారిపై కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. వారు విదేశాల్లో తలదాచుకుని తప్పించుకుని ఉన్నారు. ఇప్పుడు మరో బ్యాంకు కుంభకోణం చోటు చేసుకుంది. 34000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సిబిఐ అరెస్టు చేసింది..

Bank Fraud: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణం.. రూ.34000 కోట్ల మోసం.. మాజీ డైరెక్టర్‌ అరెస్ట్‌
Dhfl Bank Fraud Case
Follow us

|

Updated on: May 15, 2024 | 9:44 AM

దేశంలో బ్యాంకింగ్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు పెద్ద ఎత్తున బ్యాంకు మోసాలకు పాల్పడగా, వారిపై కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. వారు విదేశాల్లో తలదాచుకుని తప్పించుకుని ఉన్నారు. ఇప్పుడు మరో బ్యాంకు కుంభకోణం చోటు చేసుకుంది. 34000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ధీరజ్ వాధవాన్‌ను అరెస్టు చేసిన తర్వాత, ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వాధావన్ 17 రుణ బ్యాంకులతో ఈ మోసానికి పాల్పడ్డాడు. ఇది ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసం. 34,000 కోట్ల విలువైన 17 బ్యాంకుల కన్సార్టియం మోసానికి సంబంధించి సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుల కన్సార్టియంకు నాయకత్వం వహిస్తోంది. 2022లోనే బ్యాంకు మోసం కేసులో ధీరజ్ వాధావన్ పేరును సీబీఐ ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అదే సమయంలో ఇది దేశ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద మోసంగా పరిగణించబడుతుంది. ఇంతకు ముందు కూడా యెస్ బ్యాంక్ కుంభకోణం కేసులో ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను ఈ కేసులో బెయిల్‌పై ఉన్నాడు.

17 బ్యాంకుల నుంచి మోసం జరిగినట్లు ఆరోపణలు:

డిహెచ్‌ఎఫ్‌ఎల్ సిఎండి కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ సహా మొత్తం 74 మంది, 57 కంపెనీలపై సిబిఐ న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆఫ్ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 17 బ్యాంకుల్లో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఈవో హర్షిల్ మెహతా పేరును కూడా చార్జ్ షీట్‌లో చేర్చారు.

ఇవి కూడా చదవండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుపై దాఖలు చేసిన APIR, DHFL కపిల్ వాధావన్, డైరెక్టర్‌గా ఉన్న ధీరజ్ వాధావన్, ఇతర నిందితులతో కలిసి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకులతో మోసం చేయడానికి కుట్ర పన్నారని పేర్కొంది. నేరపూరిత కుట్ర చేసి రూ.42,871.42 కోట్ల రుణం ఇవ్వాలని ఈ బ్యాంకులను కోరింది. భారీ మొత్తంలో రుణం తీసుకుని దుర్వినియోగం చేశారు. సీబీఐ ప్రకారం.. జూలై 31, 2020 నాటికి 17 బ్యాంకుల కన్సార్టియం బకాయిల కారణంగా రూ. 34615 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త