ఇండోర్(indoor) విమానాశ్రయంలో సరైన శిక్షణ తీసుకోని పైలట్లను ల్యాండ్ చేయడానికి అనుమతించనందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌పై విమానయాన రంగ నియంత్రణ సంస్థ DGCA రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఈ విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్ సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని అధికారులు తెలిపారు. “ఇది తీవ్రమైన ఉల్లంఘన, ఇది విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది” అని అధికారి తెలిపారు. ఈ కేసులో విస్తారా విమానయాన సంస్థను దోషిగా పరిగణిస్తూ రూ.10 లక్షల జరిమానా విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. అయితే ఈ విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
విమానానికి మొదటి అధికారిగా నియమించిన పైలట్‌కు మొదట సిమ్యులేటర్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి శిక్షణ ఇస్తారు. అప్పుడే ప్రయాణికులతో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అతను అర్హులుగా పరిగణిస్తారు. అంతే కాకుండా విమానం కెప్టెన్ కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్‌తో పాటు విస్తారాకు చెందిన ఇండోర్ విమానానికి చెందిన మొదటి అధికారి కూడా సిమ్యులేటర్‌లో శిక్షణ తీసుకోలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఎయిర్‌లైన్స్ మొదటి అధికారిని విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించింది.