మీరు పీపీఎఫ్ (PPF) ఈకౌంట్ లేదా సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న పొదుపు పథకాల కింద మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం అవసరం. ఖాతాదారుడు ప్రతి సంవత్సరం కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలమైతే ఖాతా స్తంభింపజేయవచ్చు. ఇది కాకుండా ఖాతాదారుకు జరిమానా కూడా విధించవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్, ఎన్‌పీఎస్, సుకన్య సమృద్ధి ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీ ఈ ఏడాది మార్చి 31. వరకు. 2023 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఏప్రిల్ 1, 2023 నుండి కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్ మార్చింది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెంచారు. ఇది కాకుండా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయనందుకు జరిమానా విధించవచ్చు:
అటువంటి పరిస్థితిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కి సంబంధించి మీ పన్ను చెల్లించడానికి మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు గత ఆర్థిక సంవత్సరం వరకు పాత పన్ను విధానంలో పన్ను చెల్లించడంతో పాటు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే, ప్రతి సంవత్సరం మాదిరిగానే మీరు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌పీఎస్ వంటి పొదుపు పథకాల్లోపెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ, ఈ పొదుపు పథకాలలో పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందలేరు. అలాగే ఈ ఖాతాలన్నింటిలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయనందుకు జరిమానా కూడా విధించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి