మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే పద్దతులలోనూ మార్పులు వస్తున్నాయి. ఇవి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయడంతో పాటు అప్పటి వరకూ ఉన్న కొన్ని ప్రాధాన్యాలను తగ్గిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారాలకు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా రిమోట్ వర్క్ గురించి తెలుసుకుందాం. రిమోట్ వర్క్ అంటే ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవడం.
రిమోట్ వర్క్ అనేది వ్యాపారులు, ఉద్యోగులు ఇద్దరికీ అనుకూలమైన ఎంపికగా మారింది. కోవిడ్ మహమ్మారికి ముందే ఈ ట్రెండ్ వచ్చింది. అయితే కరోనా సమయంలో ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కంపెనీలు తమ ఉద్యోగులకు స్టే ఎట్ హోమ్ ఆదేశాలు ఇవ్వడంతో ఊపందుకుంది. ఇలా వీరి సంఖ్య పెరగడంతో నివాస స్థలాల డిమాండ్‌పై దీని ప్రభావం పడింది. తద్వారా ఇంటి కొనుగోళ్లలో ఆలోచనలు మారాయి. ఒకప్పుడు ఉపాధి కేంద్రాలకు దూరంగా ఉన్న సబర్బన్, గ్రామీణ ప్రాంతాలలో గృహాల కొనుగోలు పెరిగింది.
రిమోట్ వర్క్ కారణంగా సబ్ అర్బన్ (నగర శివారు) ప్రాంతాలపై ఆసక్తి పెరిగింది. ఎక్కువ స్థలం, ప్రశాంత జీవితం, తక్కువ నిర్వహణ ఖర్చు కలిగిన ఆ ప్రాంతాలలోని ఇళ్ల కొనుగోలు చేసే వారు ఎక్కువయ్యారు. గతంలో ఆఫీసు కు అందుబాటులో, నగరం మధ్యలో ఉండాలనుకునే వారు ఇప్పుడు సబ్ అర్బన్ ప్రాంతాలలో గృహాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు గృహ నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల విధానాలపై మార్పు తీసుకువచ్చింది.
గృహాల కొనుగోలు నిర్ణయాలలో వచ్చిన ఈ మార్పు కారణంగా హోమ్ లోన్ పద్ధతులను కూడా మారేలా చేసింది. ప్రస్తుతం రిమోట్ జాబ్ చేస్తున్న వారి అవసరాలను తీర్చడానికి తనఖా ఆస్తులను పరిచయం చేస్తున్నారు. అంటే ఆస్తిని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఇది రుణదాతలు, రుణ గ్రహీతలు ఇద్దరికీ ఉపయోగంగా ఉంటుంది. ప్రతినెలా ఈఎమ్ఐల రూపంలో వాయిదాలు చెల్లించాలి. గృహ కొనుగోలుదారులలో సర్దుబాటు-రేటు తనఖాలపై ఆసక్తి పెరిగింది. గృహ ఈక్విటీ రుణాలను రీఫైనాన్స్ చేసే అవకాశం కలిగింది.
పూచీకత్తు ప్రక్రియ మారుతోంది. కేవలం ఉద్యోగ పదవీకాలం కాకుండా ఆస్తులు, క్రెడిట్ చరిత్రపై అదనపు దృష్టి పెడుతుంది. గిగ్ ఎకానమీ విస్తరిస్తున్నప్పుడు ఫ్రీలాన్సింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక భద్రతను అంచనా వేసేటప్పుడు రిమోట్ ఆదాయ స్థిరత్వం మరింత అనుకూలంగా మారుతుంది. రిమోట్ జాబ్ ల కారణంగా కలిగిన సర్దుబాట్లు.
సరళీకృత అర్హత ప్రమాణాలతో తనఖా సమర్పణలు రూపొందించారు.
పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిపోతే, లో కాస్ట్ మార్కెట్ లోని గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ మార్పు ద్వితీయ నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు అనుగుణంగా విస్తృత శ్రేణి తనఖా ఉత్పత్తుల అభివృద్ధికి దారితీస్తుంది. తద్వారా ఆయా ప్రాంతాలలో ఆస్తి విలువలు వేగంగా పెరుగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..