
లగ్జరీ కారుకు భారీ ధర ఉంటుంది. చాలా మందికి కారు కొనాలనే కల ఉంటుంది. ఏదో సాధారణ కారు కొనే వాళ్లకు కూడా కొన్ని లగ్జరీ కారు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ దాని ధర చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే.. రూ.84 లక్షల కారు కేవలం రూ.2.50 లక్షలకే వస్తుందంటే ఎగిరిగత్తేస్తారు కదా. పైగా ఇదేదో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా కాదు. జస్ట్ రూ.2 లక్షల 50 వేలు ఉంటే చాలు లగ్జరీ బెంచ్ కారు కొనుకోవచ్చు. అయితే అది కొత్త కారు కాదు పాత కారు. ఇలాంటి కార్లు కొనాలని అనుకునేవాళ్లు ఈ ధర చూసి సంతోషపడుతున్నా.. అమ్మే వాళ్లు మాత్రం లబోదిబోమంటున్నారు. మరి అంత బలవంతంగా ఎందుకు అమ్ముకోవాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రూల్ అలా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చింది.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్‌తో లక్షలు పోసి కొన్ని తమ లగ్జరీ కార్లను బలవంతంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం.. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధం ఉంది. ఇలా కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరు. సో.. వేరే దారి లేక అలాంటి వాహనాలను ఇతర రాష్ట్రాల వారికి అమ్మా్ల్సిన పరిస్థితి ఉంది. వాయు కాలుష్యం కారణంగా ఈ రూల్స్ తీసుకొచ్చారు. అయితే కొంతమంది తమ వాహనాలను పెద్దగా వాడక, తక్కువ కిలో మీటర్లు తిప్పి, ఇంకా మంచి కండీషన్‌లో ఉండి, మంచి లైఫ్ టైమ్ ఉండి కూడా తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది. ఈ రూల్స్‌పై తాజాగా కొంతమంది ఢిల్లీకి చెందిన లగ్జరీ కారు ఓనర్లు తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రితేష్ గండోత్రా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ.. “ఈ కార్‌ను కేర్‌ఫుల్‌గా వాడుతున్నాం.. నా కారు 8వ సంవత్సరాలు పాతది. డీజిల్ వెహికల్, కేవలం 74,000 కిలో మీటర్లు మాత్రమే తిరిగింది. కోవిడ్ సమయంలో ఇది రెండు సంవత్సరాలు కేవలం పార్కింగ్‌లోనే ఉండిపోయింది. ఇంకా 2 లక్షల కిలో మీటర్ల తిరగగల లైఫ్ టైమ్ కలిగింది ఉంది.” అని తన కారు గురించి బాధను వ్యక్తం చేశాడు. వరుణ్ విజ్ అనే మరో వ్యక్తి 2015లో కొనుగోలు చేసిన తన మెర్సిడెస్-బెంజ్ ML350 కారును చాలా తక్కువ ధరకు అమ్మవలసి వచ్చిందని వెల్లడించారు. 2015లో రూ.84 లక్షలకు లగ్జరీ SUVని కొనుగోలు చేసిన విజ్, అద్భుతమైన స్థితిలో ఉండి, 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినప్పటికీ దానిని రూ.2.5 లక్షలకు అమ్మవలసి వచ్చిందని తెలిపాడు. ఇలా ఢిల్లీలో చాలా మంది భారీ ధర పెట్టి లగ్జరీ కార్లు కొన్న వారు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి