Father Debts Rules: తండ్రి చనిపోయిన తర్వాత అప్పులను కొడుకు తీర్చాల్సిందేనా? అత్యంత కీలకమైన సమాచారం మీకోసం..

|

Aug 14, 2022 | 1:54 PM

Father Debts Rules: ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణానంతరం, కుటుంబంలో ఆస్తి విషయంలో చాలా గొడవలు జరుగుతాయి. అలాగే ఆ వ్యక్తి తీసుకున్న..

Father Debts Rules: తండ్రి చనిపోయిన తర్వాత అప్పులను కొడుకు తీర్చాల్సిందేనా? అత్యంత కీలకమైన సమాచారం మీకోసం..
Loans
Follow us on

Father Debts Rules: ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణానంతరం, కుటుంబంలో ఆస్తి విషయంలో చాలా గొడవలు జరుగుతాయి. అలాగే ఆ వ్యక్తి తీసుకున్న రుణాల గురించి కూడా చాలాసార్లు గొడవలు జరుగుతాయి. ఆస్తి పొందే విషయంలో చాలా మంది ముందుకు వచ్చినా.. రుణం చెల్లించే విషయంలో మాత్రం అందరూ వెనక్కి తగ్గుతారు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత అతను చెల్లించాల్సిన రుణాన్ని కొడుకు తీర్చాలని ఎప్పుడైనా ఆలోచించారు. ఇంతకీ ఈ విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి. రుణం తీర్చాలా? తీర్చొద్దా? అనే వివరాలు ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

చట్టం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 52, 53 ప్రకారం.. తండ్రి చేసిన బ్యాంకు రుణాన్ని, ఆ తండ్రి ఆస్తికి వారుసుడుగా ఉన్న వ్యక్తే చెల్లించాలి. అయితే, ఈ విషయంలో అనేక షరుతులు కూడా ఉన్నాయి. ఈ షరతుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మరణించిన వ్యక్తి ఏదైనా సంపద, ఆస్తిని కలిని ఉన్నాడా? అనేది కీలకం. అదే సమయంంలో పిల్లల ఆస్తి వారి స్వంతంగా సంపాదించినది అయితే, పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. మరణించిన వ్యక్తి చేసిన అప్పులు ఎంత, అతని ఆస్తులకు వారసులు ఎంతమంది? అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమగ్ర వివరాలను పరిగణనలోకి తీసుకుని, చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతంది. అలాగే, తీసుకున్న బ్యాంకు రుణాల రకాలపైనా చెల్లించే విషయం ఆధారపడి ఉంటుంది.

రుణాల రకాలు, చెల్లించే విధానాలు..
1. గృహ రుణం విషయంలో వారసుడు ఆస్తిపై హక్కును పొందుతాడు. ఈ సందర్భంలో వారసుడే రుణాన్ని చెల్లించాల్సి వస్తుంది.
2. కారు లోన్ విషయంలో చూసినట్లయితే, కారును అమ్మి డబ్బు పొందవచ్చు.
3. వ్యక్తిగత రుణం విషయంలోకి వస్తే.. అది బ్యాంక్ నామినీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా ఉంటే అది వేరేలా ఉంటుంది.
4. బిజినెస్ లోన్ విషయంలో ఆస్తి ఆధారంగా రుణాలను వసూలు చేయడం జరుగుతుంది.
5. క్రెడిట్ కార్డులలో కూడా ఆస్తుల ఆధారంగా డబ్బు వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..