Debit Card రిప్లేస్‌మెంట్ ఛార్జీలు ఏ బ్యాంకులో ఎంత..? SBI సహా 6 బ్యాంకుల ఛార్జీల వివరాలు..

|

Oct 23, 2023 | 4:33 PM

చాలా బ్యాంకులు మీ డెబిట్ కార్డ్‌కి అకౌంట్ తెరచిన రెండో సంవత్సరం నుండి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెడుతాయి. ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్ల పొదుపు ఖాతా నుండి ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. ఒక్కో రకం డెబిట్ కార్డుకు ఒక్కో రకమైన ఛార్జీ ఉంటుంది. డెబిట్ కార్డు దొంగతనంపోయినా.. లేదా పొరబాటున పోగొట్టుకున్నా వాటి స్థానంలో కొత్త డెబిట్ కార్డును జారీ చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తాయి.

Debit Card రిప్లేస్‌మెంట్ ఛార్జీలు ఏ బ్యాంకులో ఎంత..? SBI సహా 6 బ్యాంకుల ఛార్జీల వివరాలు..
Sbi Debit Card
Follow us on

Debit Card Replacement Charges: చాలా బ్యాంకులు మీ డెబిట్ కార్డ్‌కి అకౌంట్ తెరచిన రెండో సంవత్సరం నుండి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెడుతాయి. ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్ల పొదుపు ఖాతా నుండి ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. ఒక్కో రకం డెబిట్ కార్డుకు ఒక్కో రకమైన ఛార్జీ ఉంటుంది. డెబిట్ కార్డు దొంగతనంపోయినా.. లేదా పొరబాటున పోగొట్టుకున్నా వాటి స్థానంలో కొత్త డెబిట్ కార్డును జారీ చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకుల డెబిట్ కార్డుల రీప్లేస్‌మెంట్ ఛార్జీలను ఎంత వసూలు చేస్తాయో తెలుసుకోండి.

బ్యాంకుల వెబ్‌సైట్లలోని సమాచారం ఆధారంగా డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీల వివరాలు..

SBI బ్యాంకు డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ కింద రూ. 300తో పాటు GST  వసూలు చేస్తుంది. GST 18% గా ఉంటుంది.

HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రీప్లేస్‌మెంట్ లేదా డెబిట్ కార్డ్ రీ-ఇష్యూ ఛార్జీ కింద రూ. 200తో పాటు 18 శాతం GST వసూలు చేస్తుంది.

ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్‌ కోసం రూ. 200తో పాటు GSTని వసూలు చేస్తుంది. జీఎస్టీ 18 శాతంగా ఉంటుంది.

యస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

యస్ బ్యాంక్ డెజిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ కింద రూ. 199తో పాటు GST వసూలు చేస్తుంది.

కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

కెనరా బ్యాంక్ డెటిట్ బ్యాంకు రీప్లేస్‌మెంట్ ఛార్జీ రూ. 150తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది. జీఎస్టీ 18 శాతంగా ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ

PNB డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీగా కార్డును బట్టి రూ. 150 నుండి రూ. 500 వరకు వసూలు చేస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం.

మీ డెబిట్ కార్డు పోయిన వెంటనే నేరుగా సదరు బ్యాంకు బ్రాంచ్‌ని లేదా ఆన్‌లైన్ ద్వారా దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. కొత్త డెబిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీతో పాటు జీఎస్టీ మొత్తాన్ని ఖాతాదారుల బ్యాంకు నుంచి తీసుకుంటారు.