ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు 2023-24 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం..మొదటి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి ఒక రోజు ముందు ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై వివరణాత్మక సమీక్షను అందించే కీలకమైన పత్రం. ఇది భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) మార్గదర్శకత్వంలో ఆర్థిక వ్యవహారాల విభాగం ఆర్థిక విభాగంచే తయారు చేస్తారు.
ఆర్థిక సర్వే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సూచనను అందిస్తుంది. ఇది విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి, ఆర్థిక వ్యూహాలను రూపొందించడానికి అవసరమైన సాధనంగా చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిష్పాక్షిక అంచనాను అందించడం ద్వారా ఆర్థిక సర్వే పారదర్శకతను పెంచుతుంది. అలాగే ప్రభుత్వ ఆర్థిక విధానాలలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్‌పై వేరే ట్రైన్ ఎక్కవచ్చా..? నిబంధనలు ఏంటి?
పత్రం రెండు భాగాలుగా విభజించి ఉంటుంది.పార్ట్ A దేశం ఆర్థిక పరిణామాలు, సవాళ్లను సమీక్షిస్తుంది. ఆర్థిక వ్యవస్థ విస్తృత అవలోకనాన్ని అందిస్తుంది. పార్ట్ B సామాజిక భద్రత, పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మానవాభివృద్ధి, వాతావరణ సమస్యలు వంటి నిర్దిష్ట అంశాలపై దృష్టి పెడుతుంది. పరిశ్రమ, వ్యవసాయం, ఉపాధి, ధరలు, ఎగుమతులతో సహా వివిధ రంగాలకు సంబంధించిన వివరణాత్మక గణాంక విశ్లేషణను అందించడంలో ఈ విభాగం సహాయపడుతుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతలను నిర్ణయించడంలో ఆర్థిక సర్వే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏయే రంగాలకు ఎక్కువ నిధులు, విధాన మద్దతు, ప్రభుత్వ కార్యక్రమాలు అవసరమో ఇది హైలైట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Budget 2024: ఈ బడ్జెట్‌లో మోడీ సర్కార్ వీటిపై భారీ ప్రకటన చేయనుందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి