
సైబర్ సెక్యూరిటీ కంపెనీ సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో 20 కంటే ఎక్కువ ప్రమాదకరమైన క్రిప్టోకరెన్సీ వాలెట్ యాప్‌లు కనుగొన్నామని స్పష్టం చేసింది. ఇవి వినియోగదారుల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి వారిని ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ యాప్‌ల ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారుల నుండి 12 పదాల వాలెట్ రికవరీ పాస్‌వర్డ్‌ను దొంగిలించడం. ఏదైనా క్రిప్టో వాలెట్‌ను మళ్లీ యాక్సెస్ చేయడానికి లేదా పునరుద్ధరించడానికి ఈ పాస్‌వర్డ్ అవసరం. వినియోగదారు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత, హ్యాకర్లు అతని వాలెట్‌పై పూర్తి నియంత్రణను పొంది దానిలో ఉన్న అన్ని డిజిటల్ ఆస్తులను దొంగిలిస్తున్నారని నివేదికలో స్పష్టం చేశారు.
ఈ యాప్‌లు పాత చెల్లుబాటు అయ్యే డెవలపర్ ఖాతాల ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారను. ఇవి గతంలో గేమింగ్ లేదా వీడియో యాప్‌లను సృష్టించాయి. దీంతో వినియోగదారులు వీటిని విశ్వసిస్తున్నారు. ఈ యాప్‌లు నకిలీ వెబ్‌సైట్‌లు, ప్యాకేజీ పేర్లు, అసలు యాప్‌ల మాదిరిగానే డిజైన్‌లను కలిగి ఉంటాయి. ఇవి ప్రజలను సులభంగా మోసం చేస్తాయి. ఈ యాప్‌లు సుషీస్వాప్, పాన్‌కేక్‌స్వాప్, హైపర్‌లిక్విడ్, రేడియం వంటి ప్రసిద్ధ దేఫి వాలెట్‌ల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఆ నకిలీ అప్లికేషన్‌లను ఏంటో ఓ లుక్కేద్దాం.