D Mart: డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో ఆఫర్లు చూస్తే అవాక్కే..

రీటెయిల్ రంగంలో డీ-మార్ట్ టాప్‌లో ఉన్నప్పటికీ.. ప్రజలకు అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. జియో మార్ట్, బిగ్ బాస్కెట్ వంటివి బల్క్ ఆఫర్‌లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. క్విక్-కామర్స్ వేగవంతమైన డెలివరీతో ఆకర్షిస్తోంది. సరైన ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

D Mart: డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో ఆఫర్లు చూస్తే అవాక్కే..
Check Best Online And Offline Grocery Deals

Updated on: Nov 14, 2025 | 12:44 PM

భారతీయ రిటైల్ మార్కెట్‌లో డీ-మార్ట్‌ది ప్రత్యేక స్థానం. ఇది తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కేవలం డీ-మార్ట్ మాత్రమే కాదు.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రంగాలలో అనేక ఇతర స్టోర్‌లు కూడా మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డీమార్ట్ కంటే తక్కువ ధరలకే వస్తువులను అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేస్తున్నారు. ఏది కావాలన్న నిమిషాల్లోనే డెలివరీ అవుతుండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పచ్చు.

జియో మార్ట్

జియో మార్ట్ డీ-మార్ట్‌కి బలమైన పోటీ. కొన్ని ఉత్పత్తులపై ఎమ్మార్పీ కంటే 40శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. కిస్సాన్ కెచప్ వంటివి తక్కువ ధరకే అందిస్తుంది. బల్క్ ఆఫర్‌లు, ఉచిత లేదా తక్కువ డెలివరీ ఛార్జీలు అందించడంలో జియో మార్ట్ ముందుంటుంది. యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

బిగ్ బాస్కెట్

ప్రత్యేకంగా ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై మంచి ఆఫర్స్ ఇస్తుంది. సాధారణంగా 11-12శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయి. నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి, ముఖ్యంగా మెట్రో నగరాలలో ఆర్గానిక్, ప్రీమియం వస్తువుల కొనుగోలుకు ఇది మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి

బ్లింకిట్

క్విక్-కామర్స్‌లో ఇది అగ్రగామి. కేవలం 30 నిమిషాలలోపే డెలివరీ అందిస్తుంది. రోజువారీ కిరాణా, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. ధరలు డీ-మార్ట్ స్థాయిలో లేదా అంతకంటే తక్కువగా కూడా ఉండవచ్చు.

అమెజాన్ – ఫ్లిప్‌కార్ట్

కిరాణా సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఇవి 11-12 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తాయి. పండుగ సీజన్లలో భారీ ఆఫర్లను అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు వంటి అనేక కేటగిరీలలో మంచి ఉత్పత్తులు లభిస్తాయి.

ఆఫ్‌లైన్ రిటైల్ – స్థానిక ఎంపికలు

బల్క్ షాపింగ్‌కి లేదా స్థానిక అవసరాలకు డీ-మార్ట్‌కు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. తక్కువ ధరలు, బల్క్ డిస్కౌంట్‌లతో డీ-మార్ట్‌కు గట్టి పోటీ ఇస్తుంది.
విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, శుభ్రమైన స్టోర్ల నిర్వహణ వీటి బలం.

విశాల్ మెగా మార్ట్

తక్కువ ధరలకు కిరాణా, దుస్తులు మరియు గృహోపకరణాలు అందించే మంచి గమ్యం. కొన్ని ఉత్పత్తుల ధరలు డీ-మార్ట్ కంటే కూడా తక్కువగా ఉండటం గమనించదగిన విషయం.

మొత్తంగా చూస్తే, డీ-మార్ట్ ఒక అగ్రగామి అయినప్పటికీ.. వినియోగదారులు జియో మార్ట్, బిగ్ బాస్కెట్, రిలయన్స్ స్మార్ట్ వంటి అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు పొందవచ్చు. ఆఫర్లను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి