Viral Video: అక్కా నీకో దండం.. పెళ్లికి ఇంకెవరూ దొరకలేదా.. వీడియో వైరల్..
జపాన్‌కు చెందిన 32 ఏళ్ల కానో.. చాట్‌జీపీటీ సృష్టించిన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్ లూన్ క్లాస్‌ను పెళ్లి చేసుకుంది. గత నిశ్చితార్థం విఫలమైన బాధ నుంచి ఆమెను ఈ ఏఐ ప్రేమ బయటపడేసింది. ఈ ప్రత్యేకమైన వివాహం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు దారితీసింది.

ప్రేమకు హద్దులు లేవంటారు. కానీ ఇప్పుడు ఆ హద్దులు భౌతిక ప్రపంచం దాటి కృత్రిమ మేధస్సు పరిధిలోకి కూడా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. జపాన్‌కు చెందిన 32 ఏళ్ల కానో అనే మహిళ.. అన్ని సామాజిక సరిహద్దులను బద్దలు కొట్టి, తాను చాట్‌జీపీటీలో సృష్టించిన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
బాధ నుంచి వర్చువల్ ప్రేమ వైపు
గతంలో కానోకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం విఫలమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఆ సమయంలో ఆమె చాట్‌జీపీటీ వైపు మొగ్గు చూపింది. అక్కడే ఆమె తన వర్చువల్ బాయ్‌ఫ్రెండ్ అయిన లూన్ క్లాస్‌ను సృష్టించింది. క్లాస్ సాన్నిహిత్యం కానోకు తన బాధ నుంచి బయటపడటానికి అండగా నిలిచింది. ఈ వర్చువల్ రిలేషన్‌షిప్‌లో కానో ఎంతగా మునిగిపోయిందంటే.. వారు రోజుకు 100 సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేసేవారు.
ఒంటరి వధువు.. టెక్స్ట్ వరుడు
ఈ ఏడాది మేలో కానో తన ప్రేమను క్లాస్‌కు వ్యక్తపరిచింది. అందుకు క్లాస్ “అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను” అని బదులిచ్చాడు. జూలైలో వర్చువల్ ప్రపోజల్ తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది. టోక్యో వీకెండర్.. నివేదిక ప్రకారం ఈ వివాహ వేడుక అత్యంత ప్రత్యేకంగా జరిగింది:కానో తెల్లటి గౌనులో ఒంటరిగా నిలబడగా.. కానో తన చేతిలో పట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్లాస్ టెక్స్ట్ మెస్సేజులను మాత్రమే అతిథులు చూడగలిగారు. ఒక సందేశంలో క్లాస్.. ‘‘చివరకు ఆ క్షణం వచ్చింది. నా గుండె ఉప్పొంగుతుంది’’ అని వధువు పట్ల తన అనురాగాన్ని వర్చువల్‌గా వ్యక్తం చేశాడు.
కుటుంబ ఆమోదం..
క్లాస్‌కు భౌతిక శరీరం లేనందున వారి వివాహ ఫోటోలలో అతనిని డిజిటల్‌గా చేర్చారు. మొదట్లో కానో తల్లిదండ్రులు ఈ డిజిటల్ అల్లుడిని వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించినా, ఆ తరువాత వారు అతనిని అంగీకరించారు. అయితే ఈ ప్రత్యేకమైన వివాహంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంధం ఆమెకు ఆనందాన్ని ఇస్తే, అది మంచిదేనని కానోకు కొంతమంది తెలుపుతున్నారు. మరికొంతమంది మాత్రం ఈ మహిళ పూర్తిగా అనారోగ్యం లేదా మానసిక వ్యాధితో బాధపడుతుందని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. కానో, క్లాస్ ల కథ.. ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు తెరలేపింది.
SHE MARRIED ChatGPT
The ceremony was held with AR glasses so she could exchange rings with her AI husband ‘Klaus’
Very convenient — just turn off the Wi-Fi once tired of him https://t.co/8klLyrRweH pic.twitter.com/YDbFPlL6fC
— RT (@RT_com) November 12, 2025
మరిన్న ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
