పోలీసు, సీబీఐ. ఆదాయపు పన్ను శాఖ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాధితులు పెరుగుతూ ఉంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ప్రకారం గత ఏడాది 11 లక్షల పైగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయయి. సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడటానికి అనేక పద్దతులు పాటిస్తారు. అధికారుల పేరుతో ఫోన్ చేసి బాధితుడిని పూర్తిగా నమ్మిస్తారు. అనంతరం కేసులు, నిబంధనల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకోసం కొత్త పద్దతులను ఎంచుకుంటారు. మోసాన్ని బాధితుడు పసిగట్టేలోపుగానే డబ్బులను స్వాహా చేస్తారు. నకిలీ వెబ్ సైట్ల రూపొందించి, ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా సైబర్ నేరగాళ్ల ఈ కింద తెలిపిన పద్దతుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
మనం నిత్య జీవితంలో అనేక ప్రోడెక్టులు వాడుతూ ఉంటాం. వాటిపై సందేశాలు వస్తే కస్టమర్ కర్ నంబర్ ను సంప్రదిస్తాం. కొందరు మోసగాళ్లు ప్రఖ్యాత బ్రాండ్లకు నకిలీ నంబర్లు తయారు చేస్తారు. వీటిని ఆన్ లైన్ లో పోస్టు చేస్తారు. వాటిని కాల్ చేసిన కస్టమర్లను మోసం చేస్తారు.
ఉత్తర భారతదేశంలో అనేక మంది వర్చువల్ అరెస్టు స్కామ్ బారిన పడుతున్నారు. ఈ విధానంలో మోసగాళ్లు తాము కస్టమ్స్ లేదా పోలీసు అధికారులమని బాధితులను నమ్మిస్తారు. బాధితుడి పేరిట వచ్చిన పార్సిల్ లో డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలు ఉన్నట్టు చెబుతారు. విచారణ పేరుతో పూర్తిగా భయపెడతారు. దాని నుంచి బయట పడాలంటే డబ్బులు కట్టాలని చెబుతారు. బాధితుడిని వీడియో కాల్ లో ఉండాలని ఆదేశించారు. తమ ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత వదిలేస్తారు.
ఆధార్ కార్డును హ్యాక్ చేసి మోసాలకు పాల్పడేవారు ఇటీవల పెరిగారు. సాధారణంగా ఆధార్ నంబర్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు. దీన్నే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అంటారు. దీని ద్వారా బాధితుడి బయో మెట్రిక్ సమాచారాన్ని హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగిస్తున్నారు. ముందుగా స్కామర్లు నకిలీ ఖాతాలను తయారు చేస్తారు. మోసం చేయాలనుకునే వ్కక్తికి తెలిసిన వారు, బంధువుల ఫొటోలను వాటికి యాడ్ చేస్తారు. అత్యవసరంగా డబ్బు అవసరమైందంటూ చాట్ చేస్తారు. తమ స్నేహితులు, బంధువులే కదా అని చాాలామంది డబ్బులను పంపించి మోసపోతున్నారు.
ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండటానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేకుండా ఏఈపీఎస్ లావాదేవీలను నివారించడానికి ఆధార్ బయోమెట్రిక్ లను లాక్ చేయాలి. మీ స్టాఫ్ వేర్ ను ఇన్ స్టాల్ చేయాలని, ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేయాలని వచ్చిన అభ్యర్థనలను పట్టించుకోకూడదు. చెల్లింపులకు క్యూఆర్ కోడ్ ను తప్పకుండా ఉపయోగించాలి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీకు వచ్చిన ఎస్ఎంఎస్ లేదా లింక్ ను జాగ్రత్తగా పరిశీలించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి