Helpline Number: 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకున్నారా? దీని ఉపయోగం ఏంటి?

|

Aug 24, 2024 | 7:41 PM

భారతదేశం డిజిటల్ యుగం వైపు వేగంగా దూసుకుపోతోంది. ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు ఇంటి నుండి చేసే విధంగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుకు సంబంధించిన అనేక పనులు, బుకింగ్స్‌ కూడా ఇప్పుడు ఇంటి నుంచే చేస్తున్నారు. డిజిటల్ ఇండియా ప్రచారం బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేయడం లేదా కొత్త ఖాతా..

Helpline Number: 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకున్నారా? దీని ఉపయోగం ఏంటి?
Helpline Number
Follow us on

భారతదేశం డిజిటల్ యుగం వైపు వేగంగా దూసుకుపోతోంది. ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు ఇంటి నుండి చేసే విధంగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుకు సంబంధించిన అనేక పనులు, బుకింగ్స్‌ కూడా ఇప్పుడు ఇంటి నుంచే చేస్తున్నారు. డిజిటల్ ఇండియా ప్రచారం బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేయడం లేదా కొత్త ఖాతా తెరవడం, బ్యాంకుకు సంబంధించిన అనేక పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయి. దీని కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సాంకేతికతకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.

డిజిటల్ మోసాల ప్రభావం..

డిజిటల్ ఇండియాగా దూసుకుపోతున్న భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు, ఇతర మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ స్కామర్లు కస్టమర్లను స్కామ్ చేయడానికి ఉపాయాలు ఉపయోగిస్తున్నారు. సామాన్య ప్రజలను మోసం చేసేందుకు ఉచ్చు బిగిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని నిమిషాల్లోనే అవిరైపోతుంది. సైబర్ మోసం సామాన్యులకే కాదు ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మీ బ్యాంకు వరకు అందరూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సైబర్ మోసాల సంఘటనలను పరిశీలిస్తే, చిన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద అధికారులు, బడా నాయకులు, పరిపాలన అధికారులు, పోలీసులు కూడా ఈ చిక్కుల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తుంది. వారిని మోసగించే ప్లాన్‌ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ స్కామర్ల గురించి ప్రజలను హెచ్చరించడానికి, వారిని వెంటనే ట్రాక్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందించింది. సైబర్ నేరాల విషయంలో ప్రజలు 1930కి డయల్ చేయవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

వెంటనే మొబైల్‌లో నంబర్‌ను సేవ్ చేసుకోండి

పెరుగుతున్న ఆన్‌లైన్ కేసుల దృష్ట్యా సహాయం పొందేందుకు 1930 ఈ నంబర్‌ను కేటాయించారు. ఈ నంబర్‌ని మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. మీకు అవసరమైనప్పుడు ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా మోసం జరిగినప్పుడు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి