Crypto Losses: ఊహించని స్థాయిలో కుప్పకూలిన ‘క్రిప్టో కరెన్సీ’.. తీవ్ర ఆందోళనలో ఇన్వెస్టర్లు..

|

May 14, 2022 | 6:40 AM

Crypto Losses: క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ ఎన్నడూ లేని స్థాయిలో కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో ఒకే రోజు ఈ స్థాయిలో క్రిప్టో మార్కెట్‌ పడిపోవడం ప్రపంచ వ్యాప్తంగా..

Crypto Losses: ఊహించని స్థాయిలో కుప్పకూలిన ‘క్రిప్టో కరెన్సీ’.. తీవ్ర ఆందోళనలో ఇన్వెస్టర్లు..
Crypto
Follow us on

Crypto Losses: క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ ఎన్నడూ లేని స్థాయిలో కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో ఒకే రోజు ఈ స్థాయిలో క్రిప్టో మార్కెట్‌ పడిపోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ పతనం దేనికి దారి తీస్తోందనే విషయంలో ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.. క్రిప్టో కరెన్సీ అనే బుడగ పేలిపోయిందా అన్న పాయింటే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పటి వరకూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన క్రిప్టో కరెన్సీ ఇప్పుడు నష్టాలను చూపిస్తోంది.. ఇటీవల క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోతుండడంతో లక్షలకు లక్షలు అవిరైపోతున్నాయి.. ఇందులో పెట్టుబడి పెట్టిన వారంతా షాక్‌ అవుతున్నారు.. తాజాగా ప్రపంచంలో తొలి డిజిటల్‌ కరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ వ్యాల్యూ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. కాగా నిన్న 25 వేల డాలర్ల దిగువకు వచ్చి కొంత కోలుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం.

ఈ వారం రోజుల్లో క్రిప్టో మార్కెట్‌లో 200 బిలియన్ల పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. నష్టాలు 30 శాతం నుండి 90 శాతం వరకు ఉంటాయని అంచనా.. ఆరు నెలల క్రితం 69 వేల డాలర్లకు ఎగువ ట్రేడ్‌ అయిన బిట్‌ కాయిన్‌ ఒక్కసారిగా సగానికి పడిపోడం గమనించవచ్చు.. 16 నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. టెర్రా యుఎస్‌, లునా, డోజ్‌‌కాయిన్, కార్డానో వంటి క్రిప్టో కరెన్సీల వాల్యు కూడా గతంలోకన్నా సగానికి పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో ఒడిదుడికులు కొత్తేం కాదంటున్నారు నిపుణులు.. 2017, 2021లో కూడా ఇలాంటి ఇలాంటి క్రాష్‌లే వచ్చాయంటున్నారు. కాగా తాజాగా ఉక్రెయిన్‌ వార్‌, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగదల, అమెరికాలో ఆర్థి మాద్యం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి.. దీని ప్రభావం క్రిప్టో మీద కూడా పడిందని విశ్లేషిస్తున్నారు.. మరోవైపు పలు దేశాల్లో ఈ కరెన్సీ మార్కెట్‌ మీద విధిస్తున్న ఆంక్షలు, పన్నులు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

క్రిప్టోలో నిన్నటి దాకా ఇక్కడ కనిపించిన లాభాలు కాస్తా ఆవిరవడంతో ఇన్వెస్టర్లు ఉస్సూరుమంటున్నారు.. క్రిప్టోలో లాభాలు మాట అటు ఉంచితే తేడా కొడితే భారీగా నష్టపోవాల్సి వస్తోందని భావిస్తున్నారు. ఎంతైనా ఇది రిస్క్‌ బిజినెసే అంటున్నారు..

మరోవైపు క్రిప్టో మార్కెట్‌లలో ఇప్పుడు పరిస్థితులు బాగా లేకున్నా ఇన్వెస్టర్స్‌ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగానే భావించాలలని సూచిస్తున్నారు. త్వరలోనే క్రిప్టో పుంజుకుంటుందని అంచనా.. అయితే ఇన్వెస్టర్లు రిస్క్‌ అధికంగా ఉండకుండా 10-20 శాతం హోల్డ్‌ చూసుకోవాలంటున్నారు.