స్టాక్ మార్కెట్ల పాలిట ఓ శనిలా కరోనా…మరోసారి భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు

|

Apr 12, 2021 | 4:56 PM

Stock Markets: దేశియ స్టాక్ మార్కెట్ల పాలిట కరోనా ఓ శనిలా మారింది. కరోనా ప్రభావం కారణంగా  భారత స్టాక్ మార్కెట్లు తరచూ కుదేలవుతున్నాయి.

స్టాక్ మార్కెట్ల పాలిట ఓ శనిలా కరోనా...మరోసారి భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు
Stock Markets
Follow us on

Stock Markets: దేశియ స్టాక్ మార్కెట్ల పాలిట కరోనా ఓ శనిలా మారింది. కరోనా ప్రభావం కారణంగా  భారత స్టాక్ మార్కెట్లు తరచూ కుదేలవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం సెకండ్ వేవ్ మొదలైన తర్వాత సూచీలు మరోసారి సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 1,707.94 పాయింట్లు పతనమై 47,883.38 వద్ద ముగిసింది. 2021లో నమోదైన రెండో అతిపెద్ద నష్టం ఇదే.  కిందటి ముగింపు 49,591.32 తో పోలిస్తే సెన్సెక్స్ 3.44 శాతం నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 524 పాయింట్ల నష్టంతో 14,310 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద సోమవారం ఒక్క రోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల మేర ఆవిరైపోయినట్లు మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

దేశంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు స్టాక్ మార్కెట్లను ఒత్తిళ్లకు గురిచేశాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయితో సహా అనేక చోట్ల మళ్లీ లాక్‌డౌన్ వచ్చే పరిస్థితులు సూచీలను కుంగదీశాయి.

ఈ సందర్భంగా…కరోనా మొదలైన తరువాత గత ఏడాదిగా సెన్సెక్స్‌ లో నమోదైన భారీ పతనాలు చూద్దాం..

తేదీ – పతనమైన పాయింట్లు
09-03-2020 -1,941.67
12-03-2020 -2,919.26
16-03-2020 -2,713.41
18-03-2020 -1,709.58
23-03-2020 -3,934.72
04-05-2020 -2,002.27
26-02-2021 -1,939.32
12-04-2021 -1,707.94

కరోనాకు ముందు స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే నమోదైన అతిపెద్ద పతనాలు

తేదీ – పతనమైన పాయింట్లు శాతం
28-04-1992 -570 12.77
17-05-2004 -565 11.14
18-05-2006 -826 6.76
21-01-2008 -1,408 7.40
17-03-2008 -951 6.03
24-10-2008 -1,070 10.95
24-08-2015 -1,624 5.93
09-11-2016 -1,689 5.90

ఇవి కూడా చదవండి..Covid-19 News: దేశంలో కరోనా గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా? వారం రోజుల వ్యవధిలోనే…

Stock Market: స్టాక్ మార్కెట్‌లో లాక్‌డౌన్ భయాలు…రూ.8,00,000 కోట్ల మదుపర్ల సంపద హుష్…