
ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఇప్పటివరకు దాదాపు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం కనుగొనబడింది. అయితే ఇందులో 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే తవ్వి తీయబడింది. మిగిలిన 57,000 మెట్రిక్ టన్నుల బంగారం ఇప్పటికీ భూగర్భంలో అలాగే ఉంది. ఈ నిధిలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా వంటి దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిధులు వెలికి తీయడం ద్వారా ఆయా దేశాలతో పాటు వల్ల ఇండియాకు కూడా మేలు చేకూరే అవకాశం ఉంది. అదెలాగంటే..
ఇప్పటివరకూ వెలికి తీయని బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా భూగర్భంలో దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు అంచనా. దీని విలువ దాదాపు 720 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే సుమారు రూ. 60 లక్షల కోట్లు. ఇక రెండవ స్థానంలో రష్యా ఉంది. ఆ దేశంలో కూడా భూగర్భంలో దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇక్కడ 3,600 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు అంచనా.
వెలికి తీయని బంగారు నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరంగా కీలకం కానున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాల ఆధిపత్యం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ మూడు దేశాలు భారత్ కు మిత్ర దేశాలే అవ్వడంతో ఇది మనకు జాక్ పాట్ లాంటిది అంటున్నారు నిపుణులు. తక్కువ ధరకి లేదా తక్కువ ట్యాక్స్ ధరలతో ఆయా దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొంత లాభం చేకూరుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.