కొవిడ్-19 ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెగుతుండటం… అంతర్జాతీయ మార్కెట్లు మందకోడిగా ఉండటంతో ముంబై బుల్ నేల చూపులు చూసింది. గతవారం లాభాలతో ముగిసిన మార్కెట్లు… ఈ వారం ప్రారంభంలోనే నష్టాలను మూటగట్టుకుంది.
సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 33,229 వద్ద నిలవగా.. నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 9,814 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ఉదయం నుంచి అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.
మొత్తం మీద సెన్సెక్స్ 33,670 వద్ద ప్రారంభమై 32,924 దిగువకు పడిపోయింది. ఇదే బాటలో నిఫ్టీ సైతం 9,943 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 9,726 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. గత వారం దూకుడు ప్రదర్శించిన బ్యాంకింగ్ షేర్లు కూడా లాభాలను అందుకోలేక పోయాయి.