అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! న్యూఇయర్‌ గిఫ్ట్‌గా జనవరి 1 నుంచి వీటి ధరల తగ్గింపు!

కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ, పీఎన్‌జీ వినియోగదారులకు శుభవార్త అందించింది. 2026 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి. PNGRB ఈ మేరకు ప్రకటించింది. ఈ తగ్గింపుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! న్యూఇయర్‌ గిఫ్ట్‌గా జనవరి 1 నుంచి వీటి ధరల తగ్గింపు!
Cng Price Cut

Updated on: Dec 17, 2025 | 4:01 PM

సీఎన్‌జీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. న్యూఇయర్‌ గిఫ్ట్‌గా భారతదేశం అంతటా వినియోగదారులు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరలు తగ్గించనుంది. 2026 జనవరి 1 నుంచి ఈ తగ్గింపు అమలులోకి వస్తుందని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) సైతం ‍ప్రకటించింది. కొత్త ఏకీకృత టారిఫ్ నిర్మాణం వల్ల రాష్ట్రం, వర్తించే పన్నులను బట్టి వినియోగదారులకు యూనిట్‌కు రూ.2 నుండి రూ.3 వరకు ఆదా అవుతుందని PNGRB సభ్యుడు AK తివారీ వెల్లడించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి