Children Savings Accounts: పిల్లలపై పొదుపు ఖాతాలు అందించే బ్యాంకులు.. ఈ అకౌంట్ల ద్వారా వివిధ రకాల లాభాలు..!

|

Aug 14, 2021 | 3:37 PM

Children Savings Accounts:పిల్లల కోసం పొదుపు చేయాలని, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఒక్కో పేరెంట్స్‌ ఒక్కో పెట్టుబడి..

Children Savings Accounts: పిల్లలపై పొదుపు ఖాతాలు అందించే బ్యాంకులు.. ఈ అకౌంట్ల ద్వారా వివిధ రకాల లాభాలు..!
Children Savings Accounts
Follow us on

Children Savings Accounts:పిల్లల కోసం పొదుపు చేయాలని, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే ఒక్కో పేరెంట్స్‌ ఒక్కో పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే వారి చిన్నతనం నుంచే పొదుపు ప్రణాళిక వేసుకుని ఉంటే పొదుపు ఖాతాలు కూడా ఉత్తమమైన మార్గమే. అయితే ఈ పొదుపు ఖాతాల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ త‌ల్లిదండ్రుల ఆదాయంగా పరిగ‌ణిస్తారు. అందుకే పిల్లల పేరిట ఉన్న సాధారణ పొదుపు ఖాతా, ఆర్‌డీ వంటి వాటి నుంచి వచ్చే వ‌డ్డీ త‌ల్లిదండ్రుల ఆదాయంలో భాగ‌మ‌వుతుంద‌ని గుర్తించాలి. క‌నీస నిల్వ, ఇత‌ర బ్యాంకు నిల్వలు, గ‌రిష్ట పరిమితి వంటి బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటాయి. ఇది మీరు ఖాతా తెరిచే బ్యాంకు శాఖ‌ను అడిగి తెలుసుకోవాలి. మీరు పిల్లల పేరిట పొదుపు ఖాతా తెరిచేట‌ప్పుడు వ‌డ్డీ, బ్యాంకు ప‌నితీరు వంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తారు. వ‌డ్డీ, బీమా, సులువైన బ్యాంకింగ్‌(ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్‌), బ్రాంచ్ నెట్‌వ‌ర్క్ వంటి వాటి ఆధారంగా కొన్ని పొదుపు ఖాతాల‌ను ఇక్కడ ఇచ్చాం. దేశంలో ఏ బ్యాంకు పొదుపు ఖాతా అన్నింటినీ ఒకేలా ఇవ్వదు. కాబ‌ట్టి వీటిల్లోంచి మీకు అనువైన వాటిని ఎంచుకోవడం బెటర్‌.

ఎస్‌బీఐ:

ఎస్‌బీఐ రెండు ఖాతాలు అందిస్తుంది. పెహ్లకడం, పెహ్లి ఉడాన్‌. ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించబడినవి. పెహ్లకడం పొదుపు ఖాతాను 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరైనా ప్రారంభించవచ్చు. ఈ పొదుపు ఖాతా పేరరెంట్‌, బిడ్డతో ఉమ్మడి ఖాతా. ఇక్కడ పేరెంట్‌ సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌, కిడ్‌ ప్రాథమిక హోల్డర్‌గా పరిగణిస్తారు. సాధారణ పొదుపు ఖాతా లాగా కాకుండా ఈ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ ప్రమాణాలు లేవు. మొబైల్‌ బ్యాంకింగ్‌, చెక్‌ బుక్‌ జారీ వంటివి ఉంటాయి. ఓవర్‌ డ్రాఫ్ట్‌, ఏటీఎం సౌకర్యం, ఇతర పెట్టుబడుల ఎంపిక ఈ ఖాతాలతో జాత చేస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ :

18 ఏళ్లలోపు ఉన్నవారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో డెబిట్‌ కార్డు అందజేస్తారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హెచ్‌డీఎఫ్‌సీలో పొదుపు ఖాతా కలిగి ఉండాలి. ఈ పొదుపుఖాతాలో రూ.5 వేల కనీస బ్యాలెన్స్‌తో ఉండాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినట్లయితే రూ.1 లక్ష ఉచిత ప్రమాద బీమా అందిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌పై ఉచిత ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీనికి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. పాస్‌బుక్, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పిల్లల కోసం యంగ్ స్టర్స్ సేవింగ్స్ అకౌంట్ సేవలు అందిస్తోంది. అకౌంట్‌పై డెబిట్ కార్డు ఇస్తారు.

ఐసీఐసీఐ బ్యాంకు:

ఐసీఐసీఐ.. ఐసీఐసీఐ బ్యాంక్ పిల్లల కోసం యంగ్ స్టర్స్ సేవింగ్స్ అకౌంట్ సేవలు అందిస్తోంది. ఈ అకౌంట్‌పై డెబిట్ కార్డు కూడా ఇస్తారు. ఈ ఖాతా తీసిన వారు కనీసం నెలవారీ సగటు బ్యాలెన్స్‌ రూ.3000 ఉండాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ అకౌంట్ తెరవొచ్చు. ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు ఉంటాయి.

సిటీ బ్యాంకు:

15 నుంచి 18 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు సిటీ బ్యాంకులో పొదుపు ఖాతా తీయవచ్చు. ఇందులో ఇద్దరు హోల్టర్లు ఉండాలి. మొదటి హోల్డర్‌ పిల్లలు, రెండో హోల్డర్‌ తల్లిదండ్రు లేదా సంరక్షకులుగా ఉండాలి. అయితే తల్లిదండ్రులు, లేదా సంరక్షులు అప్పటికే పొదుపు ఖాతా కలిగి ఉండాలి. ఈ ఖాతాపై ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలు ఉచితంగా ఉంటాయి. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇండస్‌ ఇండ్ బ్యాంకు :

ఈ బ్యాంకులో 12 సంవత్సరాలకంటే ఎక్కువున్న పిల్లల పేరుపై ఖాతా తీయవచ్చు. కాకపోతే ఖాతా అండర్‌ గార్డియన్‌ అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాను తల్లిదండ్రులు మాత్రమే ఆపరేట్‌ చేస్తారు.
తర్వాత పిల్లలపై మారుస్తారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు:

ఈ బ్యాంకులో 10 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలపై ఖాతా తీసుకోవచ్చు. ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండటం ముఖం. 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు తమ పొదుపు ఖాతాను స్వతంత్రంగా తెరిచి నిర్వహించుకోవచ్చు. ఖాతా తెరవడానికి కనీస బ్యాలెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఏటీఎం ద్వారా రోజువారీ పరిమితి రూ.50వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే ప్రతి రోజు ఆన్‌లైన్‌ బదిలీకి రూ.లక్ష వరకు అనుమతి ఉంటుంది. సంవత్సరానికి 50 చెక్‌లీఫ్‌లతో ఉచిత చెక్‌బుక్‌ సౌకర్యం ఉంటుంది.

ఐడీబీఐ బ్యాంకు:

పిల్లల పేరుపై పొదుపు ఖాతాను తీసేవారు కనీస ఖాతా సగటు బ్యాలెన్స్‌ రూ.500 ఉండాల్సి ఉంటుంది. ప్రతి నెల మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే పెనాల్టి ఛార్జీలు వసూలు చేస్తుంది బ్యాంకు. ఏటీఎం నుంచి రోజువారీ విత్‌డ్రా రూ.2000 వరకు చేసుకోవచ్చు. భారతదేశంలో, విదేశాల్లో పిల్లల చదువుల నిమిత్తం విద్యారుణం పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.1 డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆదాయపు పన్ను శాఖ