WIG Craft: మూడు గంటల్లోనే చెన్నై టు కోల్‌కత్తా.. జలరవాణాలో నూతన టెక్నాలజీ

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణం అనేది పెద్ద ప్రహసనంగా మారింది. చాలా మంది ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందని ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే చెన్నైకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ కొత్త టెక్నాలజీ ద్వారా కేవలం రూ.600తో మూడు గంటల్లో చేరుకోవచ్చని చెబుతుంది.

WIG Craft: మూడు గంటల్లోనే చెన్నై టు కోల్‌కత్తా.. జలరవాణాలో నూతన టెక్నాలజీ
Wig Craft

Updated on: Feb 20, 2025 | 5:10 PM

చెన్నై నుంచి కోల్‌కతాకు కేవలం మూడు గంటల్లో జిప్ ద్వారా ప్రయాణించవచ్చని ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ మద్దతు ఉన్న ఓ స్టార్టప్ ప్రతినిధులు చెబుతున్నారు. ఏరో ఇండియా 2025 సందర్భంగా వాటర్‌ఫ్లై టెక్నాలజీస్ స్టార్టప్ ప్రతినిధులు ఈ కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ వింగ్-ఇన్-గ్రౌండ్ క్రాఫ్ట్‌లైన ఎలక్ట్రిక్ సీగ్లైడర్‌ల ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెబుతున్నారు.  నీటి నుంచి టేకాఫ్ చేసి నాలుగు మీటర్ల ఎత్తులో ఎగరడానికి వీలు కల్పించే డిజైన్‌ను ద్వారా ఇది సాధ్యమనేనని పేర్కొంటున్నారు. కోల్‌కతా నుంచి చెన్నైకి డబ్ల్యూఐజీ క్రాఫ్ట్‌లో ప్రయాణించడానికి 1,600 కి.మీ ప్రయాణానికి సీటుకు కేవలం రూ. 600 మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా టిక్కెట్ ధర తక్కువ ఉండడంతో ఎక్కువ మంది ఇది ఎలా సాధ్యం అంటూ చర్చించుకోవడం విశేషం. 

డబ్ల్యూఐజీ క్రాఫ్ట్‌ ద్వారా విమానం కంటే 10 రెట్లు మెరుగైన ఇంధన సామర్థ్యంతో ప్రయాణాలు చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎయిర్‌బస్ ఏ320 లేదా బోయింగ్ 737లో చెన్నై నుంచి కోల్‌కతాకు వెళ్లే విమానం దాదాపు 2.5 నుండి 3 టన్నుల ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అవసరం అవుతుంది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధర కొన్ని నగరాల్లో కిలోలీటర్‌కు రూ.95000 నుంచి మరికొన్ని నగరాల్లో రూ.98000 వరకు ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూఐజీ క్రాఫ్ట్‌ ఫ్లాట్ డిజైన్ కారణంగా అత్యంత వేగంగా వెళ్లవచ్చు. అలాగే విమానాలు టేకాఫ్ అయిన తర్వాత అధిక ఎత్తుకు ఎగిరిన తర్వాత ప్రయాణిస్తుంది. అయితే డబ్ల్యూఐజీ క్రాఫ్ట్‌ టెక్నాలజీ ఎక్కువ ఎత్తు ఎగరాల్సిన అవసరం లేదు. నీటి ఉపరితలం నుంచే ప్రయాణించే సౌకర్యం ఉండడంతో తక్కువ ఇంధన అవసరం అవుతంది. 

డబ్ల్యూఐజీ క్రాఫ్ట్‌ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఏరో ఇండియాలో డిజైన్ మాత్రమే ప్రదర్శించారు. వాటర్‌ఫ్లై టెక్నాలజీస్ స్టార్టప్  కంపెనీ ఏప్రిల్ 2025 నాటికి 100 కిలోల ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత సంవత్సరం చివరిలో ఒక టన్ను ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది నాటికి 20 సీట్ల సామర్థ్యంతో పూర్తి స్థాయి వెర్షన్‌ను ఆశించవచ్చని వాటర్‌ఫ్లై తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాంట్లను పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి