AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Used cars: సెకండ్ హ్యాండ్ కార్‌ కొంటున్నారా.? ముందు ఈ విషయాలు గమనించండి..

ఒకప్పుడు కారు అంటే ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే పరిమితమనే ఆలోచనలో ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మధ్య తరగతి వారు కూడా కారు కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బైక్‌ ధరలోనే కార్లు కూడా లభిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజలు కార్ల కొనుగోలుకు...

Used cars: సెకండ్ హ్యాండ్ కార్‌ కొంటున్నారా.? ముందు ఈ విషయాలు గమనించండి..
Second Hand Car
Narender Vaitla
|

Updated on: Mar 10, 2024 | 5:39 PM

Share

ఒకప్పుడు కారు అంటే ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే పరిమితమనే ఆలోచనలో ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మధ్య తరగతి వారు కూడా కారు కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. బైక్‌ ధరలోనే కార్లు కూడా లభిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సెకండ్ హ్యాండ్‌ కొనుగోలు చేసే సమయంలో ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశం. సదరు కారుకు గతంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్రమాదం జరిగిన కార్లు సెంటిమెంట్‌గానే కాకుండా, కారులోని పార్ట్స్‌ కూడా దెబ్బతిని ఉంటాయని గుర్తుంచుకోవాలి.

* ఇక మీరు కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన ఏమైనా లోన్‌ పెండింగ్‌లో ఉంద అన్న విషయాలను సైతం గమనించాలి. కారు ఫైనాన్షియల్‌ స్టేటస్‌ ఏంటో తెలుసుకోవాలి.

* ఇక కారు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఒక మంచి మెకానిక్‌తో కారును చూపించుకోవాలి. కారులో ఉన్న లోపాలను మెకానిక్స్‌ అయితే సరిగ్గా గుర్తిస్తారు. ఒకసారి టెస్ట్‌ డ్రైవ్‌ చేసిన తర్వాతే కారును కొనుగోలు చేయాలి. వాహనం నడుస్తున్నప్పుడు ఇంజిన్​తో సహా, ఇతర భాగాల నుంచి ఏవైనా శబ్దాలు వస్తున్నాయా? లేదా? అనేది చూసుకోవాలి.

* అలాగే కారులో ప్రధానమైన ఇంజిన్, గేర్ బాక్స్, సస్పెన్సన్, బ్రేక్​లు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. భవిష్యత్తులో వాటికి ఏమైనా ఖర్చు చేయాల్సి ఉంటుందా అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

* మీరు ఒకవేళ స్వల్పకాలిక వ్యవధి కోసం కారును తీసుకుంటే కచ్చితంగా కారు రీసేల్ వస్తుందా లేదా అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీరు అనుకున్న మొత్తానికి కారు రీసేల్‌ ఉంటేనే ఆ కారును కొనుగోలు చేయాలి.

* ఇక మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారుకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్‌ పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్టీవో ఆఫీస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ, ఇతర ఆర్థిక సంబంధిత పత్రాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే కారు కొనుగోలు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు