
గత కొంతకాలంగా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లడం ఖరీదైనదిగా మారింది. విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలను రికార్డు స్థాయిలో పెంచాయి. మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ కలిగి ఉంటే.. కానీ మీరు ఖరీదైన విమాన టిక్కెట్ల కారణంగా వెళ్లలేకపోతే.. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బడ్జెట్లో, చౌకగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. దీంతో మీరు తక్కు ధరలో విమాన టికెట్లను బుక్కింగ్ చేసుకోవచ్చు. మీకు అలాంటి కొన్ని మార్గాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా చౌకగా విమాన టిక్కెట్లను పొందవచ్చు. ఈ చిట్కాలతో మీరు అనుకున్నదానికంటే అత్యంత తక్కువకే విమాన ప్రయాణం చేయవచ్చు. మీరు దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా చౌకగా ప్రయాణించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ ట్రిక్స్ ఏంటో వెంటనే తెలుసుకండి..
మీరు విమాన టిక్కెట్ కోసం బుక్ చేయబోతున్నట్లయితే.. దానికి ఓ మంచి సమయం ఉంది.. మంచి సమయం అంటే ముహూర్తం కాదండి.. మీరు మధ్యాహ్నం 12 గంటల తర్వాత దేశీయ విమానానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అన్ని బుధవారాలు, అన్ని గురువారాల్లో స్కైస్కానర్‌లో చౌకైన టిక్కెట్‌లను కనుగొనవచ్చు. అయితే రాత్రి పూట ఇక్కడ టిక్కెట్ల కోసం వెతకాల్సి ఉంటుంది.
మీరు ఫ్లైట్ టికెట్ బుకింగ్ కోసం స్కైస్కానర్‌ని పదే పదే తెరిస్తే.. అంటే చాలాసార్లు టికెట్ కోసం వెతకొద్దు. అలా చేస్తే అది మీకు ఎక్కువ టిక్కెట్ డబ్బును పెంచుతుంది. దీని కారణంగా మీరు బుకింగ్ సమయంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అందుకే.. మీరు ( Incognito విండోలో)ఎన్‌కోజిటివ్ మోడ్‌లో విండో తెరవడం అవసరం. తద్వారా మీ IP చిరునామాను ట్రాక్ చేయడం సాధ్యం కాదు.
ఫ్లైట్ టిక్కెట్‌లను బుక్ చేస్తున్నప్పుడు.. ఒకే స్థలం టిక్కెట్ల కోసం వెతకవద్దు.. లేకుంటే మీరు ఆ ప్రదేశానికి ఎక్కువ టిక్కెట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ప్రదేశాలలో.. మీరు ప్రయాణించాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకుని, ఆ ప్రదేశానికి టికెట్ బుక్ చేసుకోండి.
ఏ రోజు తక్కువ ధరకు టిక్కెట్లు లభిస్తున్నాయో వెతకాలి. తేదీల వారీగా విమాన టిక్కెట్లను వెతకడం ద్వారా మీరు విమాన టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్‌తో మీరు టికెట్లను పొందవచ్చు. దీంతో మీరు అనుకున్న టూర్ తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు.
మరిన్ని టూరిజం న్యూస్ కోసం