Whatsapp Chat GPT: వాట్సాప్‌లో చాట్ జీపీటీ సేవలు.. ఆ రెండు సేవలకే పరిమితం

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్‌ను అధికంగా వాడుతూ ఉన్నారు. అయితే ఈ వాట్సాప్‌లో తాజాగా చాట్ జీపీటీ సేవలు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చాట్ జీపీటీ సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Whatsapp Chat GPT: వాట్సాప్‌లో చాట్ జీపీటీ సేవలు.. ఆ రెండు సేవలకే పరిమితం
Whatsapp Chat Gpt

Updated on: Feb 06, 2025 | 4:01 PM

ఓపెన్‌కు ఏఐకు చెందిన చాట్ జీపీటీ సేవలు వాట్సాప్ ఇమేజెస్, వాయిస్ సందేశ ఇన్‌పుట్‌లను అంగీకరించేలా వాట్సాప్‌లో తాజా అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 2024లో ఏఐ చాట్‌బాట్ కోసం అధికారిక ఫోన్ నంబర్‌ను ప్రవేశపెట్టాక ఈ అప్‌డేట్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ప్రారంభ సమయంలో  టెక్స్ట్-ఆధారిత ప్రశ్నలకు మాత్రమే మద్దతు ఇచ్చింది. తాజా అప్‌డేట్‌తో ఇతర ప్రశ్నలకు మద్దతు ఇచ్చేలా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు వాట్సాప్ చాట్ జీపీటీతో కొత్త మార్గాల్లో సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్లను మొదట ఆండ్రాయిడ్ అథారిటీ గుర్తించింది. అప్పటి నుంచి చాట్‌బాట్‌కు వినియోగదారు కమ్యూనిటీలో విస్తృత ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలతో వినియోగదారులు చాట్ జీపీటీ ద్వారా ఫోటోలు లేదా మీమ్‌లను పంపవచ్చు.

అలాగే టెక్స్ట్ విషయానికి వచ్చేసరికి వాయిస్ ఇన్‌పుట్‌కు సంబంధించిన ఏకీకరణ వెల్కమ్ ఆఫర్‌ను అందిస్తుంది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రాంప్ట్‌లను టైప్ చేయడానికి ఇష్టపడే వారికి ఈ ఫీచర్ అనువుగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇప్పుడు వాయిస్ సందేశాలను సులభంగా పంపే అవకాశం ఉంటుంది. ఏఐ చాట్‌బాట్ ఆడియో ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేసి, టెక్స్ట్-ఆధారిత ప్రతిస్పందనను అందిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ చాట్ జీపీటీ ఖాతాలను నేరుగా వాట్సాప్ ద్వారా సైన్ ఇన్ చేసే అవకాశం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. 

ఈ అప్‌గ్రేడ్‌లు యాక్సెసిబిలిటీ, యూసేజ్ విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న చిత్రాలను పంపేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ చిత్రాలు ఓపెన్ ఏఐ సర్వర్‌లలో ప్రాసెస్ అవుతాయిన అందువల్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీకి కొత్త డీప్ సెర్చ్ మోడ్‌ను కూడా జోడించింది. దీని వల్ల వినియోగదారులు మరింత సంక్లిష్టమైన పనుల కోసం వెబ్‌లో మల్టీ లెవల్ సెర్చింగ్‌ చేయడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా గత నెలలో బ్రౌజర్ సంబంధిత పనుల కోసం ఆపరేటర్ ఏఐ ప్రారంభించాక  డీప్ రీసెర్చ్ అనేది ఓపెన్ ఏఐకు సంబంధించిన రెండో ఏఐ ఏజెంట్‌గా ఉండనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి