Hero HF Deluxe to EV Bike: హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ను ఈవీ మార్చుకోండిలా..! ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాకవుతారు.

|

May 14, 2023 | 6:00 PM

ఈ నేపథ్యంలో, గోగోఏ1డాట్‌కామ్‌ అనే కంపెనీ పెట్రోల్‌తో నడిచే బైక్‌లు, స్కూటర్‌లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తుంది. ఈ కంపెనీ ఆర్‌టీఓ ఆమోదించిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, మూడు చక్రాల వాహనాల కోసం ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను తయారు చేస్తుంది. ఈ కంపెనీను 2011లో శ్రీకాంత్ షిండేచే స్థాపించారు.

Hero HF Deluxe to EV Bike: హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ను ఈవీ మార్చుకోండిలా..! ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాకవుతారు.
Hf Deluxe Web
Follow us on

ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రతిరోజూ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో, గోగోఏ1డాట్‌కామ్‌ అనే కంపెనీ పెట్రోల్‌తో నడిచే బైక్‌లు, స్కూటర్‌లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తుంది. ఈ కంపెనీ ఆర్‌టీఓ ఆమోదించిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, మూడు చక్రాల వాహనాల కోసం ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను తయారు చేస్తుంది. ఈ కంపెనీను 2011లో శ్రీకాంత్ షిండేచే స్థాపించారు. అంతే భారతదేశ వ్యాప్తంగా ఈ కంపెనీకు 50 కంటే ఎక్కువ ఫ్రాంఛైజీలు ఉన్నాయి.ఈ కంపెనీ బ్యాటరీ, ఫిట్టింగ్, ఆర్‌టీఓ పేపర్లు, జీఎస్టీ, డెలివరీని ఒకే ధరకు కలిగి ఉండే మార్పిడి కిట్‌ను అందిస్తుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేయడం లేదు. అలాగే కంపెనీ కోట్ చేసిన ధర కూడా అందుబాటులో ఉంటుంది. అంటే వినియోగదారులు తమ పెట్రోల్‌తో నడిచే వాహనాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

ఖర్చు ఇలా

వినియోగదారులు తమ పెట్రోల్‌తో నడిచే బైక్‌లు, స్కూటర్‌లను ఎలక్ట్రిక్‌గా మార్చడానికి ఆసక్తి ఉన్నవారికి, ఎంచుకోవడానికి మూడు ఎంపికలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ధర పరిధి ఆధారంగా ఉంటుంది. 60 కిలో మీటర్ల రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కావాలంటే రూ.83,283 వెచ్చించాల్సి ఉంటుంది. 80 కిలోమీటర్ల పరిధికి రూ.95,708, 100 కిలో మీటర్ల రేంజ్‌కు రూ.1,08,033 చెల్లించాల్సి ఉంటుంది. స్కూటర్‌లో ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకునే వారి వెబ్‌సైట్‌ను సందర్శిస్తే అదనపు వివరాలన్నీ అందులో పేర్కొన్నారు. 

హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఈవీ కోసం 5 కేడబ్ల్యూ గరిష్ట పవర్ అవుట్‌పుట్, గంటకు 60 కిలోమీటర్లు గరిష్ట వేగంతో వెళ్లేలా ఒక ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. అలాగే ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఈ హెచ్‌ఎఫ్​ డీలక్స్ ఎలక్ట్రిక్ అవతార్ అనేది ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారికి పర్యావరణ అనుకూలమైన పరిష్కారంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి