Self Help Groups: మహిళల కోసం మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ప్రతి ఏడాది లక్ష రూపాయల సంపాదన..!

Self Help Groups: మోడీ సర్కార్‌ మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు..

Self Help Groups: మహిళల కోసం మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ప్రతి ఏడాది లక్ష రూపాయల సంపాదన..!

Updated on: Nov 02, 2021 | 6:07 AM

Self Help Groups: మోడీ సర్కార్‌ మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని మోడీ సర్కార్ భావిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి ఏడాది రూ.లక్ష సంపాదించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందు కోసం ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

మహిళలకు జీవనోపాధి:
అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వచ్చే రెండేళ్లలో 2.5 కోట్ల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు జీవనోపాధిని కల్పించనుంది. దీని వల్ల వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావిస్తోంది కేంద్రం. స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల ఆదాయం, జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఆర్థిక పరమైన, సామాజిక పరమైన చేయూత అందిస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇప్పటికే 7.7 కోట్ల మంది మహిళలు 70 లక్షలకుపైగా స్వయం సహాయక గ్రూపుల్లో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయంతో మహిళలు ఆర్థికంగా మరింతగా ఎదిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు.. కేంద్రం కీలక నిర్ణయం..!

Ola Car Offer: మీరు కారు కొనాలనుకుంటున్నారా..? కస్టమర్లకు ‘ఓలా’ అదిరిపోయే ఆఫర్‌.. లక్ష వరకు తగ్గింపు..!