రైతుల సంక్షేమం కోసం పలు రకాల పథకాలను ప్రవేశపెడుతూ వస్తోన్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో తీసుకొచ్చిన ఈ కొత్త పథకం ద్వారా రైతులు రూ. 3 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం కల్పించింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆవులు, గేదె, మేకలు, చేపలు వంటి వాటి పెంపకం సాగిస్తోన్న రైతులందరికీ ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందిస్తోంది.
పశుపోషణణు ప్రోత్సహించి పాలు, పాల ఉత్పత్తులు, మాంసం కొరతను తీర్చాలనే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్డు సహాయంతో రైతులు సులభంగా రుణాలు పొందే అవకాశం కల్పించారు. పీఎం కిసాన్ ఉపయోగించుకుంటున్న వారు కూడా ఈ కార్డును పొందొచ్చు. కేవలం 7 శాతం వడ్డీకే రూ. 3 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఏడాదిలోపు రుణం చెల్లించే వారికి అదనంగా సబ్సిడీ సైతం అందిస్తారు. రైతులు ఐదేళ్లలో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కార్డు పొందాలనుకునే రైతులు ముందుగా దగ్గరల్లోనీ బ్యాంకుకు వెళ్లాలి. అనంతరం దరఖాస్తు ఫామ్ తీసుకొని సంబంధిత వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కేవైసీ కోసం కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ధృవీకరణ అనంతరం 15 రోజులలోపు కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తారు. ఇందుకోసం ఆధార్డ్ కార్డ్, జంతవుల ఆరోగ్య ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, బ్యాంకు ఖాతా, భూమి డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అందించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..