కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) కింద తేజస్, వందే భారత్, హమ్ సఫర్ రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. వివిధ ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నుంచి వచ్చిన అనేక సూచనలను, ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఈ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఎల్‌టీసీ కింద రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై తేజస్, వందే భారత్, హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని.. డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని వ్యయ శాఖ ( Department of Expenditure ) తో సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నారు..
అయితే.. ఇకపై అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్‌మెంట్ కూడా పొందనున్నారు.
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) పథకం అనేది ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా ప్రయాణించడంలో వారికి సహాయపడే రాయితీ ప్రయాణ సౌకర్యం.. దీనిలో పలు ఎంపికలు ఉంటాయి..
పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ, పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ప్రకారం.. ఉద్యోగులు రెండు సంవత్సరాల కాలానికి రెండుసార్లు స్వస్థల (హోమ్ టౌన్) LTCని పొందే అవకాశం లేదా రెండు సంవత్సరాల కాలానికి ఒకసారి స్వస్థలాన్ని సందర్శించే అవకాశం.. మరో రెండు సంవత్సరాల కాలానికి భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..