Wheat Export: పెరుగుతున్న గోధుమ పిండి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎగుమతులపై నిషేధం..!

|

Aug 26, 2022 | 7:51 AM

Wheat Flour Export: గోధుమ పిండి ఎగుమతిని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పిండి ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని..

Wheat Export: పెరుగుతున్న గోధుమ పిండి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎగుమతులపై నిషేధం..!
Wheat Flour Export
Follow us on

Wheat Flour Export: గోధుమ పిండి ఎగుమతిని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పిండి ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. దేశంలో గోధుమల ఎగుమతిపై నిషేధం తర్వాత పిండి ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో పిండి ఎగుమతులు 200 శాతానికి పైగా పెరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. పిండి ఎగుమతులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం గతంలో ఎగుమతిపై కొన్ని షరతులు విధించింది. కానీ, ఆ తర్వాత కూడా ఎగుమతులు ఆగలేదు. అయితే ఇప్పుడు ఎగుమతిని పూర్తిగా నిషేధించారు. పిండి ఎగుమతులు పెరగడం వల్ల గోధుమల ధరలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి తక్కువగా ఉంది. అయితే పిండి ఎగుమతిపై నిషేధం దేశంలో గోధుమ సరఫరా పరిమితంగా ఉందని చెబుతోంది. ఇది ధరలను మరింత పెంచవచ్చని తెలుస్తోంది.

ఈ సంవత్సరం ఏప్రిల్-జూలైలో భారతదేశం నుండి గోధుమ పిండి ఎగుమతి వార్షిక ప్రాతిపదికన 200 శాతం పెరిగింది. గతంలో గోధుమ పిండి ఎగుమతిపై నిషేధం లేదా ఎటువంటి పరిమితి లేని విధానం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆహార భద్రతను నిర్ధారించడానికి, దేశంలో పెరుగుతున్న గోధుమ పిండి ధరలకు చెక్ పెట్టడానికి ఎగుమతులపై పరిమితులు విధిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి