దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. (PM Kisan) ఇప్పటివరకు పది విడతల నగదు జమ కాగా.. 11వ విడత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పీఎం కిసాన్ 11వ విడత నగదు విడుదల చేసే తేదీని ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ఈనెల 31న పీఎం కిసాన్ తదుపరి విడత (11వ) నగదును రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారని తెలిపారు.. ప్రధాని మోదీ చివరిసారిగా 10వ నగదును జనవరి 1న విడుదల చేశారు.. అయితే 11వ విడత నగదు తమ ఖాతాల్లోకి రావాలంటే రైతులు ముందుగా eKYCని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మే 31 లోపు రైతులు తమ eKYCని అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు వారి ఖాతాల్లో జమ కాదు..
పీఎం కిసాన్ జాబితా 2022 ఎలా చెక్ చేయాలంటే..
* ముందుగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోస్టర్ లాగిన్ కావాలి..
* హోమ్ పేజీలో “ఫార్మర్స్ కార్నర్ ” పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత లబ్ధిదారుల జాబితా లింక్ పై క్లిక్ చేయాలి.
* అనంతరం రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామ సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
* చివరిగా గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. మీ జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.
పీఎం కిసాన్ నమోదు ప్రక్రియ..
* రైతులు పీఎం కిసాన్ యోజన పథకం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ లాగిన్ అయ్యి.. ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత న్యూ ఫార్మర్ ఎంటర్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
* రాష్ట్రాన్ని ఎంచుకుని.. క్యాప్చాకోడ్ ఎంటర్ చేయాలి.
* అతర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి.
* బ్యాంక్ ఖాతా, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నమోదు చేయాలి.
* తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సందర్శించి .. అన్ని వివరాలను .. ధరఖాస్తు ఫారం ఫూర్తి చేయాలి.