Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEAT Tyres: సియట్‌ నుంచి సరికొత్త టైర్లు.. గంటకు 300 కి.మీ వేగాన్ని తట్టుకునే సామర్థ్యం!

CEAT SportDrive Tyre: ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వాహనాల యజమానులు కోరుకునే ప్రమాణాలతో టైర్లను అందించాలనే నిబద్ధతకు అనుగుణంగా రన్-ఫ్లాట్ టైర్లు, CALM టెక్నాలజీ గల ZR రేటెడ్ టైర్లతో స్పోర్ట్‌డ్రైవ్ సరికొత్త టైర్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. జర్మనీలోని ప్లాంట్‌లో అనేక పరీక్షలు జరిపిన తరువాతే మార్కెట్లోకి..

CEAT Tyres: సియట్‌ నుంచి సరికొత్త టైర్లు.. గంటకు 300 కి.మీ వేగాన్ని తట్టుకునే సామర్థ్యం!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 20, 2025 | 4:25 PM

CEAT SportDrive Tyre: సాధారణంగా ఏ వాహన వేగమైన దాని ఇంజిన్‌తోపాటు వాహనానికి వాడిన టైర్లపై ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఏ వాహనానికి అయినా టైర్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సియట్ తాజాగా ఆవిష్కరించిన టైర్లు ఏకంగా గంటకు 300 కి.మీ. ల వేగాన్ని తట్టుకుని సామర్థ్యంతో ఉన్నాయి. భారత్‌లో దిగ్గజ టైర్ల తయారీ సంస్థ సియట్ తాజాగా తమ స్పోర్ట్‌డ్రైవ్ శ్రేణిలో మూడు అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. అల్ట్రా-హై పెర్ఫార్మెన్స్, లగ్జరీ ఫోర్-వీలర్ సెగ్మెంట్లో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అలాగే, రన్-ఫ్లాట్ టైర్లను, CALM టెక్నాలజీతో 300 కి.మీ మించి వేగాన్ని కూడా తట్టుకోగలిగే సామర్థ్యాలు గల 21-అంగుళాల ZR రేటెడ్ టైర్లను తయారు చేసింది సియట్. జర్మనీలోని అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్లాంట్లలో ఎన్నో కఠినమైన పరీక్షలను నిర్వహించి అందుబాటులోకి తీసుకువచ్చింది కంపెనీ. కొత్త స్పోర్ట్‌డ్రైవ్ టైర్ల శ్రేణి కింద ZR రేటెడ్ టైర్లు, CALM టెక్నాలజీ, రన్-ఫ్లాట్ టైర్ల ఆవిష్కరణతో ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత బ్రాండ్‌గా సియట్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. ఫోర్ వీలర్ టైర్ల సెగ్మెంట్లో మా అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేలా రన్ ఫ్లాట్ టైర్లను ప్రవేశపెట్టిన తొలి భారతీయ కంపెనీగా నిలవడం గర్వకారణం అని సియట్ ఎండీ, సీఈవో అర్ణబ్ బెనర్జీ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వాహనాల యజమానులు కోరుకునే ప్రమాణాలతో టైర్లను అందించాలనే నిబద్ధతకు అనుగుణంగా రన్-ఫ్లాట్ టైర్లు, CALM టెక్నాలజీ గల ZR రేటెడ్ టైర్లతో స్పోర్ట్‌డ్రైవ్ సరికొత్త టైర్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. జర్మనీలోని ప్లాంట్‌లో అనేక పరీక్షలు జరిపిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సియట్ సీఎంవో లక్ష్మీ నారాయణన్ అన్నారు. సరికొత్త ప్రీమియం టైర్ల శ్రేణి ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరు, మధురై, కేరళ, హైదరాబాద్, గువాహటి,, అహ్మదాబాద్‌లాంటి కీలక మార్కెట్లలో అందుబాటులో ఉంటాయన్నారు. రన్‌-ఫ్లాట్ టైర్ల ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయని, అలాగే, 21 అంగుళాల ZR రేటెడ్ అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ CALM టెక్నాలజీ టైర్ల ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి