Tesla Cars: టెస్లా కార్లకు వాడబోయే మేడిన్ ఇండియా టైర్లు ఏవో తెలుసా?

భారతదేశంలో టెస్లా కార్ల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. టెస్లా కార్లు వేగం విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో టెస్లా కార్లకు భారతీయ కంపెనీ టైర్లను వాడనున్నారు. చాలా కంపెనీలు టెస్లాకు టైర్లను సరఫరా చేసేందుకు ప్రయత్నించినా ఆ అవకాశం భారతీయ కంపెనీ సీయట్‌కు దక్కింది.

Tesla Cars: టెస్లా కార్లకు వాడబోయే మేడిన్ ఇండియా టైర్లు ఏవో తెలుసా?
Tesla Tyre

Edited By: Janardhan Veluru

Updated on: Feb 19, 2025 | 5:30 PM

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన టెస్లా భారతదేశంలో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. టెస్లా భారతదేశంలో ఇప్పటికే నియామకాలను ప్రారంభించింది. ఏప్రిల్ నుంచి టెస్లా కార్ల విక్రయాలు భారత్‌లో షురూ కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఢిల్లీ, ముంబైలలో టెస్లా కార్ షోరూమ్‌‌లు ఏర్పాటు చేయాలని టెస్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరికొన్ని మాసాల్లోనే టెస్లా కార్లు భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. టెస్లా ప్రపంచంలోనే అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆటోపైలట్, డాగ్ మోడ్, లూడిక్రస్ ప్లస్ మోడ్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టెస్లా కార్లు స్పీడ్ విషయంలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇంత స్పీడ్ వెళ్లే టెస్లా కార్లకు భారతీయ కంపెనీ అయిన సీయట్ టైర్లను సరఫరా చేయనుంది. ఈ విషయాన్ని ఆర్‌పీజీ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎక్స్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు.

టెస్లా కంపెనీ టైర్ల విషయానికి వచ్చేసరికి చాలా కంపెనీల టైర్లను ఉపయోగిస్తుంది. టెస్లా అధిక పనితీరు గల వాహనం కాబట్టి కారులో ఉపయోగించే టైర్లు దాని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, అధిక టార్క్‌ను గరిష్ట భద్రత వంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టైర్లను ఎంపిక చేస్తూ ఉంటారు. టెస్లా టైర్లు ఎక్కువ రోజులు పని చేసేలా మందపాటి సైడ్‌వాల్‌లతో అధిక నాణ్యత రబ్బరుతో తయారు చేసే రేడియల్ టైర్లను ఉపయోగిస్తుంది. 

అనేక కంపెనీలు టెస్లా కోసం టైర్లను రూపొందించి అభివృద్ధి చేశాయి. వీటిలో పిరెల్లి, హాంకూక్, కాంటినెంటల్ ఉన్నాయి. 50 శాతం కంటే ఎక్కువ టెస్లా కార్లలో మిచెలిన్ టైర్లు ఉంటాయి. టెస్లా ఆమోదిత టైర్లు సైడ్‌వాల్‌పై టీ-మార్క్‌తో ఉంటాయి. టెస్లా స్పెసిఫికేషన్ల ప్రకారం మోడల్ పురోగతిని టీ-మార్క్ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో తిరిగే టెస్లా కార్లకు భారతీయ కంపెనీ టైర్లనే వాడే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి