
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది సైబర్ మోస కేసులు నమోదవుతున్నాయి. ఈ మోసగాళ్ల బారిన పడి ప్రజలు డబ్బు, విలువైన వస్తువులను కోల్పోతున్నారు. అయితే ప్రభుత్వం ఇటువంటి నేరాలను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తుస్తోంది. ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఇప్పుడు GST నోటీసులకు సంబంధించి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. కంపెనీలకు నకిలీ GST నోటీసులు పంపడంపై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) హెచ్చరిక జారీ చేసింది. అటువంటి మోసపూరిత కేసులను వెంటనే నివేదించాలని పన్ను చెల్లింపుదారులను కోరింది.
మోసపూరిత GST నోటీసులు పంపబడుతున్నాయని ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారాలను హెచ్చరిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) హెచ్చరిక జారీ చేసింది. GST పన్ను చెల్లింపుదారులు అటువంటి మోసపూరిత కేసులను వెంటనే నివేదించాలని కోరారు. నకిలీ నోటీసులు ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగతంగా పంపబడుతున్నాయి, నకిలీ GST అధికారులు కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు.
మోసగాళ్ళు అధికారిక GST పత్రాలను కాపీ చేయడం ద్వారా నకిలీ సమన్లను పంపుతున్నారని CBIC తెలిపింది. వారు సెంట్రల్ GST లోగోలు నకిలీ DIN నంబర్‌లను ఉపయోగించి వాటిని నిజమైనవిగా చూపిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ శాఖ నుండి అందిన ప్రతి కమ్యూనికేషన్ లేదా లేఖలో జాబితా చేయబడిన “డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్” (DIN)ని CBSE పోర్టల్‌ని సందర్శించి ధృవీకరించాలని బోర్డు సూచించింది. నోటీసు నిజమైనదైతే అది ధృవీకరించబడుతుందని, అలా లేకుంటే వెంటనే తమకు తెలియజేయాలని బోర్డు పేర్కొంది. ఎక్స్‌లో ఒక వినియోగదారుడు GST అధికారి నుండి కాల్స్ అందుకున్నట్లు ఫిర్యాదు చేసిన దానికి ప్రతిస్పందనగా CBIC ఈ వివరణ జారీ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి