
భారతీయుల ఇళ్లల్లో తప్పనిసరిగా ఎంతోకొంత బంగారం అనేది ఉంటుంది. ఎందుకంటే గోల్డ్‌తో భారత ప్రజలకు ప్రత్యేకమైన సెంటిమెంట్ అనేది ఉంటుంది. పంక్షన్లు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది డబ్బులు పొదుపు చేసుకుని గోల్డ్ కొంటూ ఉంటారు. దీంతో దేశంలోని ప్రతీఒక్కరి ఇంట్లో గోల్డ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే దేశంలో ఏదైనా ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు దేశ ప్రజల ఇళ్లల్లోని బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా..? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచం మొత్తంలో చూస్తే మన దేశ ప్రజల ఇళ్లల్లోనే ఎక్కువ బంగారం ఉంది. అన్ని దేశాల బ్యాంకుల వద్ద కంటే భారత ప్రజల ఇళ్లల్లో బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏదైనా అనుకోని పెద్ద ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు దేశ ప్రజల ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం అలా స్వాధీనం చేసుకోవడం కదరదు. 1960లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ వంటి కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. సంక్షోభం పేరుతో ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇంట్లో ఎంతవరకు బంగారం దాచుకోవచ్చు? అనే దానిపై కొన్ని పరిమితులు అమల్లో ఉన్నాయి. ఇందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ కొన్ని నిబంధనలు విధించింది. ఈ రూల్స్ ప్రకారం.. పెళ్లి అయిన మహిళ 500 గ్రాముల వరకు ఎలాంటి రసీదు లేకుండా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇక పెళ్లి చేసుకోని మహిళ అయితే 250 గ్రాములు ఉంచుకోవచ్చు. ఇక పురుషులు 100 గ్రాముల వరకు ఇంట్లో దాచుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ బంగారం ఉంచుకుంటే అందుకు సంబంధించిన రసీదులు ఇంట్లో ఉంచుకోవాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాల సమయంలో వీటిని ఆధారాలుగా చూపించవచ్చు. ఇక బంగారం వ్యాపారం చేసేవారికి ఈ నిబంధనలు వర్తించవవు. వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వ్యాపారులు ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ నుంచి వచ్చింది అనే వివరాలు దగ్గర ఉంచుకోవాలి. కాగా ఇటీవల ఆర్బీఐ తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించిందనే వార్తలు గుప్పున్నాయి. కానీ కేంద్రం స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది.