Rs 10 Thousand Notes: మళ్లీ రూ.10 వేల నోట్లు ముద్రిస్తున్నారా.. ఆసక్తికర విషయాలు మీ కోసం..

|

Nov 12, 2021 | 2:33 PM

పెద్దనోట్లను రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ఫేక్‌ కరెన్సీని కట్టడి చేయడం కూడా. నోట్లు రద్దు చేసి ఐదేళ్లు గడిచింది. ఈ సందర్భంగా..

Rs 10 Thousand Notes: మళ్లీ రూ.10 వేల నోట్లు ముద్రిస్తున్నారా.. ఆసక్తికర విషయాలు మీ కోసం..
Bank Note Of 10 Thousand Pr
Follow us on

Rs 10 Thousand: పెద్దనోట్లను రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ఫేక్‌ కరెన్సీని కట్టడి చేయడం కూడా. నోట్లు రద్దు చేసి ఐదేళ్లు గడిచింది. ఈ సందర్భంగా నోట్లపై చాలా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. 2016లో నోట్ల రద్దులో భాగంగా రూ. 1000 నోటును రద్దు చేసిన తర్వాత రూ. 2000 నోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వాదన తెరమీదకు వచ్చింది. 2 వేల నోటు మాదిరిగానే గతంలో ముద్రించి, నిషేధించిన 10 వేల రూపాయల నోట్లను కూడా ముద్రిస్తారా? అందుకు అవకాశం ఉందా?  అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే భారతదేశంలో రూ.10 వేల నోట్ల చెలామణికి సంబంధించి అంశం తెర మీదకు వచ్చింది. అసలు 10 వేల నోటు ముద్రించారా? ఎప్పుడు ముద్రించారు? ఎందుకు రద్దు చేశారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ డౌట్లు అన్నింటికి సమాధానం తెలుసుకుందాం..

రూ. 10 వేల నోటు గురించి తెలుసుకునే ముందు ఆ నోట్లను ఎవరు ముద్రిస్తారో తెలుసుకుందాం. కరెన్సీ నోట్లను ముద్రించే హక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్బీఐకి ఉంది.  అధికారం ఉందికదా అని ఎలా పడితే అలా ముద్రించడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దీని కారణంగా కరెన్సీ విలువ దారుణంగా పతనం అవుతుంది. ద్రవ్యోల్బణం రేటు కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జీడీపీ, వృద్ధిరేటు, ఆర్థిక లోటు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం, ఆర్బీఐ ఎంత మేరకు కరెన్సీని ముద్రించాలో అంత వరకే ముద్రిస్తుంది. ఇందుకోసం ‘కనీస రిజర్వ్ సిస్టమ్’ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ అనుసరిస్తుంది.

10 వేల నోటు ఎప్పుడు ముద్రించారు?

1938 సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అతి పెద్ద కరెన్సీ నోటు రూ 10000 ని ముద్రించింది. ఆ తరువాత దీనిని జనవరి 1946లో డీమోనిటైజ్ చేశారు. తిరిగి 1954 సంవత్సరంలో మళ్లీ 10 వేల నోట్లను ముద్రించడం ప్రారంభించారు. 1978లో మళ్లీ రద్దు చేశారు. 

ఎన్ని రూపాయల వరకు నోట్లను ముద్రించవచ్చు?

ఇంత విలువ కలిగిన కరెన్సీని మాత్రమే ముద్రించాలనే నిబంధన ఏమీ లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 24 ప్రకారం కేవలం రూ. 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లతో పాటు అంతకు మించిన విలువ కలిగిన నోట్లను కూడా ముద్రించే అధికారం ఉంది. అయితే ఈ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది.

ముందుగా.. ఆర్‌బీఐ అనేక పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఎన్ని నోట్లను ముద్రించాలో తెలుసుకుని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దాని ఆధారంగా తుది నిర్ణయం తీసుకుని కరెన్సీ ముద్రణ చేపడుతుంది.

ఒకే సంఖ్యలో రెండు నోట్లు ఉండవచ్చా?

రెండు లేదా అంతకంటే ఎక్కువ నోట్లు ఒకే సాధారణ సంఖ్యలను కలిగి ఉండవచ్చు. కానీ వేర్వేరు ఇన్సెట్ లెటర్ లేదా వేర్వేరు ప్రింటింగ్ సంవత్సరం లేదా వివిధ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకంతో ఉండవచ్చు. ఇన్సెట్ లెటర్ అనేది బ్యాంక్ నోటు నంబర్ ప్యానెల్‌పై ముద్రించిన అక్షరం. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే..  ఎటువంటి ఇన్సెట్ లెటర్ లేకుండా కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..