Gratuity Calculator: గ్రాట్యుటీ అంటే ఏంటి? రూ.30 వేల జీతం ఉంటే ఎన్నేళ్లకు ఎంత వస్తుంది? ఇలా లెక్కించండి!

Gratuity Calculator: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు అందే ప్రయోజనాల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఉద్యోగం చేస్తున్న కాలంలో సంస్థ నుంచి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది నెల జీతం వచ్చిందా రాలేదా అని చూసుకుంటారు తప్ప వాటి ప్రయోజనాలు గురించి పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగులకు ముఖ్యమైనది గ్రాట్యుటీ. దీనిని ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం..

Gratuity Calculator: గ్రాట్యుటీ అంటే ఏంటి? రూ.30 వేల జీతం ఉంటే ఎన్నేళ్లకు ఎంత వస్తుంది? ఇలా లెక్కించండి!
Gratuity Calculator

Updated on: Jan 21, 2026 | 6:42 PM

Gratuity Calculator: మీరు ఉద్యోగులా..? మీకు పీఎఫ్‌ అకౌంట్‌ ఉందా.. అయితే ఈపీఎఫ్ నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీకు మీ ఉద్యోగ సర్వీసులో నెలనెలా జీతం నుంచి కట్ అయి PF అకౌంట్లో జమ అవుతుంది. దీంట్లో డబ్బుల్ని పాక్షికంగా కొన్ని అవసరాల మేరకు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత.. సర్వీసును బట్టి ఈపీఎస్ పెన్షన్ కూడా లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు అందే మరో పెద్ద ప్రయోజనం ఉంది. దీని లెక్కల గురించి అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ ప్రయోజనమే గ్రాట్యుటీ. కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి వెళ్లిపోయినా లేదా రిటైర్ అయినా కూడా ఈ గ్రాట్యుటీ ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలోని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తోంది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? దీనిని ఎలా లెక్కిస్తారు? మీ ఉద్యోగ సర్వీస్ ఎన్నేళ్లు ఉంటే గ్రాట్యుటీ ఎంత వస్తుంది? పూర్తి వివరాలు తెలసుకుందాం..

గ్రాట్యుటీ అంటే ఏమిటి?

గ్రాట్యుటీ అనేది ఒక కంపెనీ యజమాని ఉద్యోగికి అందించే సేవలకు చెల్లించే చెల్లింపు. సాధారణంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే ఈ గ్రాట్యుటీని అందిస్తారు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 ప్రకారం ఈ చెల్లింపును అందిస్తారు. ప్రమాదం లేదా వ్యాధి కారణంగా ఉద్యోగులు వైకల్యానికి గురైతే ముందుగానే గ్రాట్యుటీని పొందవచ్చు. ఈ మొత్తం చివరిగా పొందిన జీతం, సర్వీస్ సంవత్సరాలపై ఆధారపడి ఉంటుంది.

ఇలా గ్రాట్యుటీ కాలిక్యులేట్ చేసుకోండి:

గ్రాట్యుటీ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఐదు సంవత్సరాల నిరంతర సేవ తర్వాత మీరు కంపెనీ నుంచి వెళ్లిపోయినప్పుడు మీరు అందుకునే మొత్తాన్ని గ్రాట్యుటీ కాలిక్యులేటర్ అంచనా వేస్తుంది. గ్రాట్యుటీ సంఖ్యను తక్షణమే పొందడానికి మీరు చివరిగా తీసుకున్న జీతం, పదవీకాలాన్ని నమోదు చేయండి.

గ్రాట్యుటీని లెక్కించడానికి ఫార్ములా:

గ్రాట్యుటీ చట్టం కింద కవర్ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీని సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు.

కనీసం ఐదు సంవత్సరాలు పని చేయాలి. ఇలా అంతకుమించి ఎన్నేళ్లు పనిచేస్తే దానికి లెక్కించి ఇస్తారు. పని చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల వేతన సమాన మొత్తాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ పనిచేసినా సంవత్సరంగా లెక్కిస్తారు. అంటే మీరు ఐదేళ్ల 6 నెలలు పనిచేసినా కూడా ఆరేళ్లుగా పరిగణిస్తారు. ఇక గ్రాట్యుటీ ఫార్ములా (నెల జీతంx15x సర్వీస్ కాలం)/26 (పనిదినాలు) గా ఉంటుంది. ఇక్కడ 15 రోజులు అనేది 15 రోజులకు సమానమైన వేతనం, 26 అనేది నెలకు 26 పనిదినాలు. నెల జీతం బేసిక్ పేపై వర్తిస్తుంది.

 

ఇప్పుడు రూ. 30 వేల బేసిక్ పేపై 5 సంవత్సరాలు, పదేళ్లకు, ఏడేళ్లకు గ్రాట్యుటీ ఎంత వస్తుందనేది ఫార్ములాను తెలుసుకుందాం.

ముందుగా 5 సంవత్సరాలకు అయితే బేసిక్ పే రూ.30 వేలు గ్రాట్యుటీ= (30000x15x5)/26= రూ. 86,538.46 వస్తుంది. ఈ లెక్కన చూస్తే 7 సంవత్సరాల సర్వీసుపై రూ.1,21,153.84, అదే 5 సంవత్సరాల సర్వీసుకు అయితే రూ.1,73,076.92 గ్రాట్యుటీ అందుతుంది. ఇలాగే మీ మీ శాలరీపై, మీ సర్వీసు కాలానికి అనుగుణంగా లెక్కలు వేసుకొని తెలుసుకోవచ్చు.

మీరు చివరిగా రూ.30,000 జీతంతో 15 సంవత్సరాలు పనిచేసినట్లయితే గ్రాట్యుటీ ఇలా ఉంటుంది:

గ్రాట్యుటీ = (15 x 30,000 x 15) / 26 = రూ.2,59,615

గరిష్ట గ్రాట్యుటీ మొత్తం రూ.20 లక్షలు. ఏదైనా అదనపు మొత్తాన్ని ఎక్స్-గ్రేషియాగా పరిగణిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి