మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా ? అయితే మీరు అదృష్టవంతులే.. లక్షల్లో సంపాదన.. అదేలాగంటే..

|

Mar 30, 2021 | 8:28 AM

తులసి చెట్టుకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. రోజూ ఉదయాన్నే తులసి మొక్కకు పూజలు చేయడం.. ఆరాధించడం

మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా ? అయితే మీరు అదృష్టవంతులే.. లక్షల్లో సంపాదన.. అదేలాగంటే..
Tulsi Tree
Follow us on

తులసి చెట్టుకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. రోజూ ఉదయాన్నే తులసి మొక్కకు పూజలు చేయడం.. ఆరాధించడం వలన పుణ్యం లభిస్తుందని విశ్వాసింటారు. అలాగే ఈ తులసి మొక్కలను ఎక్కువగా ఆరాధనలో ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా ఈ తులసి మొక్కతో వ్యాపారం చేస్తున్నారు. దీనిని మార్కెట్లో భారీ ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దీనికి భారీగా డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో ప్రతిది వ్యాపారంగానే మారిపోయింది. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు.. మానవులకు ఎంత ముఖ్యమైనదో తెలిసిన విషయమే. ఇక కొన్ని అత్యంత ముఖ్యమైన వస్తువుల ధర మార్కెట్లో భారీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల మొక్కలను మార్కెట్లో భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారు. ఈ జాబితాలోకి తులసి చెట్టు చేరింది. అయితే ఈ తులసి చెట్టు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. మరీ అదేలాగో తెలుసుకుందామా.

తులసి చెట్టుకు మార్కెట్లో భారీగా డిమాండ్..

మన ఇంటి పరిసరాల్లో తులసి చెట్టు పెరగడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకు రకారకాల ఎరువులను వినియోగించాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం దీనికి మార్కెట్లో మాత్రం భారీగా డిమాండ్ పలుకుతుంది. ముఖ్యంగా మనం తులసి చెట్టును ఆరాదన సమయంలో మాత్రమే ఉపయోగిస్తాము. కొన్ని సందర్బాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా తులసి ఆకులను వినియోగిస్తుంటాము. ఎందుకంటే.. ఈ తులసి మొక్కలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అందుకే తులసిని ఎన్నో వ్యాధుల నియంత్రణలో ఉపయోగిస్తుంటారు. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు. ఇంటి ముంగిట్లో తులసి చెట్టు ఉంటే ఇంట్లో సమస్యలు తోలగిపోతాయని చెబుతుంటారు. తులసి మొక్కతో హారి పూజిస్తారు.

కరోనా సంక్షోభంలో డిమాండ్ పెరిగింది..

గతేడాది మొదలైన కరోనా మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి నష్టాన్ని చేకూర్చిందో తెలిసిన విషయమే. ఇప్పటికీ ఈ మహామ్మారి ప్రభావం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే చాలా మందికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా పెరిగింది. చాలా మంది రోగనిరోధక శక్తి కోసం ఇంటి ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు. అలాగే ప్రస్తుతం తులసికి డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. తులసిలో మిక్కిలి ఔషదగుణాలుండమే కారణమని చెప్పుకోవచ్చు.

వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు..

ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. కానీ.. దీనికి దీర్ఘకాలిక వ్యవసాయం అవసరం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

లక్షల్లో సంపాదన..

అయితే మీరు చేయవలసిందల్లా కేవలం ఈ తులసి చెట్లను సాగు చేయడానికి రూ.15 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విత్తనాలు నాటిన 3 నెలల తర్వాత తులసి పంటను సగటున రూ.3 లక్షల వరకు అమ్మవచ్చు. బైద్యనాథ్, పతంజలి మొదలైన మార్కెట్లో చాలా ఆయుర్వేద సంస్థలు కూడా ఒప్పందంలో తులసిని సాగు చేస్తున్నాయి. కేవలం రూ.15వేలు ఖర్చు చేస్తే… రూ.3 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

Also read:

రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా ? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది తెలుసుకుందామా..

Green Tea: రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు..