Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!

|

Apr 04, 2022 | 8:11 PM

Senior Citizens: సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ వడ్డీని

Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!
Money
Follow us on

Senior Citizens: సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ వడ్డీని అందిస్తున్నాయి. స్వల్పకాలిక డిపాజిట్లపై కూడా అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. కస్టమర్ల విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ప్రస్తుతం 2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 1 సంవత్సరంలోపు 6.75 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఇందులో చిన్న పొదుపు బ్యాంకులు FDపై అధిక రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ప్రధానంగా ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఎందుకంటే రిటైర్‌మెంట్ ఫండ్స్ ఉన్నందున సాధారణ డిపాజిటర్ల కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తారు. దాదాపు అన్ని బ్యాంకులు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. ఉదాహరణకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సాధారణ కస్టమర్లకు 6.75 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది.

ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తోంది..

2 కోట్ల కంటే తక్కువ, 2 సంవత్సరాల వరకు ఉన్న FDల వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.75 శాతం రాబడిని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ సాధారణ డిపాజిటర్‌కు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకి 7 శాతం వడ్డీని అందిస్తోంది. RBL బ్యాంక్ సాధారణ FD డిపాజిట్లపై 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీని అందిస్తోంది. అదేవిధంగా ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ FDపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. బంధన్ బ్యాంక్ సాధారణ FDపై 6.25 వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7% ఇస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్ సాధారణ FDపై 6%, సీనియర్ సిటిజన్లకు 6.25% వడ్డీని అందిస్తోంది.

గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Vastu Tips: అటాచ్డ్‌ బాత్రూమ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే చాలా అనర్థాలు..!

Viral Video: ఇదెక్కడి డ్యాన్స్‌రా బాబు.. దెబ్బకి జడుసుకున్న జనాలు..!

Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!